చిరు రిజెక్ట్ చేస్తే.. అదే కథతో రికార్డులు సృష్టించిన సూపర్ స్టార్..!!

ఏ ఇండస్ట్రీలో నైనా స్టార్ నటీనటులు సైతం కొన్ని కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది రిజెక్ట్ చేసిన కథలతోనే పలు రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఆ సినిమా ఎందుకు వదులుకున్నామని చాలా బాధపడిన సందర్భాలను.. కొంతమంది నటీనటులు తెలియజేయడం మనం చూసే ఉన్నాము. అయితే ఇప్పుడు స్టార్ హీరో రిజెక్ట్ చేసిన ఒక స్టోరీ తో రజనీకాంత్ పలు రికార్డులను క్రియేట్ చేశారు. ఆ సినిమా గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.Chiranjeevi pens heartfelt note on Rajinikanth's birthday, wishes him luck in politics - Movies News

మలయాళం సూపర్ స్టార్ సురేష్ గోపి ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం మణిచిత్ర తాల్.. ఈ సినిమాలో శోభన హీరోయిన్ గా నటించినది. ఈ చిత్రం 1993లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నది. ఈ చిత్రాన్ని రీమిక్ గా 2014లో కన్నడలో ఆప్తమిత్ర అనే సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాలో సౌందర్య హీరోయిన్గా నటించినది. ఈ చిత్రంలో విష్ణువర్ధన్ హీరోగా నటించారు. ఈ సినిమా కూడా ఘనవిజయాన్ని అందుకుంది.Chandramukhi - Disney+ Hotstar

ఇక ఇదంతా ఇలా ఉండగా ఇదే సినిమాను తమిళంలో రజినీకాంత్ హీరోగా చంద్రముఖి అనే టైటిల్తో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా లో ప్రభు పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు రజినీకాంత్. ఇక ఈ సినిమాలో జ్యోతిక, నయనతార కథానాయకులుగా నటించారు. ఈ సినిమా మొదట నాగవల్లి అని టైటిల్ ని కూడా అనుకున్నారు కానీ రజనీకాంత్ చంద్రముఖి అనే టైటిల్ ని సూచించడంతో ఈ సినిమా టైటిల్ ని మార్చడం జరిగింది. 2005వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా రికార్డులను సైతం సృష్టించింది. ఇక ప్రేక్షకులు థియేటర్లో జ్యోతిక నటనకు భయపడిపోయారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి విడుదల చేయగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.. అయితే డైరెక్టర్ విఎన్ ఆదిత్య ఈ సినిమా చూడాలని ముందుగా చిరంజీవికు సిడి పంపించారట. కానీ ఈ సినిమాను చిరంజీవి చూసి రిజెక్ట్ చేశాడు కానీ చంద్రముఖి విడుదలైన తర్వాత చిరంజీవి ఆదిత్య కు ఫోన్ చేసి అభినందించారంట .అలా చిరంజీవి కథతో రజినీకాంత్ పలు రికార్డులను సృష్టించారు.