“ఆయన మనసు బంగారం”..హీట్ పెంచుతున్న సమంత పోస్ట్..!!

అదేంటో తెలియదు కానీ, సమంత పెట్టిన ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. అది ఆమె పెట్టే పోస్ట్ మహత్యమో , లేక ఆమె పాపులారిటీ దృష్ట్యా ..అలా వైరల్ అవుతుందో తెలియడంలేదు. మనకు తెలిసిందే వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న సమంత విడాకులు తరువాత..తనకు సంబంధించిన చిన్న విషయాని కూడా సోషల్ మీడియా ద్వార అభిమానులతో పంచుకుంటుంది. బాధని అయినా, హ్యాపీనెస్ అయినా..ఇలా అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారానే పంచుకుంటుంది.

మరీ ముఖ్యంగా సమంత విడాకుల తరువాత పెట్టే ప్రతి పోస్ట్ పరోక్షంగా నాగ చైతన్యను టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. విడాకుల ముందు వరకు నాగ చైతన్య కు సంబంధించిన చిన్న అకేషన్ ని కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన..సమంత..విడాకుల తరువాత కనీసం ఆయన పుట్టిన రోజుకు విష్ కూడా చేయలేదు. విడిపోయే ముందు మాత్రం..”మేం కేవలం భార్య భర్తలు గానే విడిపోతున్నాం..మంచి ఫ్రెండ్స్ గా ఉంటాం ” అంటూ నోట్ చేసి.. కనీసం ఒకరి బర్త డే కు మరోకరు విష్ కూడా చేసుకోకుండా ఉండడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా నడిచింది.

అయితే, సమంత తన మిగతా ఫ్రెండ్స్ , స్టార్ హీరోల కు సంబంధించిన బర్తడేస్ ని మాత్రం మర్చిపోకుండా సోషల్ మీడియా వేదికగా తనతో వాళ్లకి ఉన్న ప్రేమను, ప్రెండ్ షిప్ ను తెలియజేస్తూ స్పేషల్ విషెస్ అందించింది. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కి హార్ట్ ఫుల్ విషేస్ అంటూ..”ఆయన మనసు బాంగారం”అని హ్యాపి బర్త డే చెప్పుతూ పోస్ట్ చేసింది. ఇక దీని చూసిన సమంత హేటర్స్ ఊరుకుంటారా.. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. “నీకు మొగుడు తప్పిస్తే అందరు కావాలి..వాళ్లందరికి నువ్వు కావాలి..” అంటూ మరీ దారుణంగా వల్గర్ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో సమంత, విజయ్ పై చేసిన పోస్ట్ కొత్త అర్ధాలు పుట్టిస్తుంది.

Share post:

Latest