అనిల్ రావిపూడి పై గుర్రుగా ఉన్న ఆ స్టార్ హీరో ఫ్యాన్స్.. ?

టాలీవుడ్ ఇండస్ట్రీ కి పటాస్ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి..కామెడీనే తన అస్త్రంగా మలుచుకుని..ఆ కాన్సెప్ట్ తోనే సినిమాలు తెరకెక్కిస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన సినిమాలని పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో స్టార్ సీనియర్ హీరోలు సైతం ఆయన తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వెంకటేష్ , వరుణ్ తేజ్ లతో కలిసి F2 సినిమా తెరకెక్కించాడు.

ఈ సినిమా ఎవ్వరు ఊహించని విధంగా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇండస్ట్రీ లెక్కలను మార్చేసింది. ఇక ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ గా F3 తీశాడు..డబుల్ కాదు ట్రిపుల్ ఫన్ తో..సినిమా ను తెరకెక్కించడంతో..ఈ సినిమా కూడా బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయం అందుకుంది. అయితే, ఈ సినిమాలో మిగతా హీరోయిన్స్ పాపులర్ సినిమాలను వాడుకుంటూ కొంచెం సేపు ఫన్ క్రియేట్ చేశాడు అనిల్ రావిపూడి. ఆ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

అయితే, ఈ ఎపిసోడ్ లో ఓ హీరో ని మిస్ చేశాడు అనిల్ రావిపూడి. మర్చిపోయాడో..లేక కావాలనే చేసాడో తెలియదు కానీ..ఆ స్టార్ హీరో ని మిస్ చేశాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అనిల్ పై ఫైర్ అవుతున్నారు. వేరే సినిమాల గెటప్స్ నీ..నీ సినిమాలో వాడుకోవడం ఏంటి..నీకు సినిమా తీయ్యడం రాకపోతే.. సైలెంట్ గా కూర్చో..అంతేకానీ, ఇలా చెత్త కామెడీ చేయకు..అంటూ మండిపడుతూన్నారు సదరు హీరో ఫ్యాన్స్. మరి దీని పై అనిల్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..?