మరికొన్ని గంటల్లో ఆచార్య ..పెద్ద దుమారమే రేపుతున్న చరణ్ ఓల్డ్ వీడియో..!!

కొద్ది గంటలే.. మరి కొన్ని గంటలే మిగిలి ఉంది..మెగా అభిమానుల కల నెరవేరడానికి. కొన్ని సంవత్సరాలు గా మెగా ఫ్యాన్స్ అందరు ఆశ గా ఎదురు చూస్తున్న మూమెంట్ మరి కొద్ది గంటల్లోనే రాబుతుందన్న విషయం తెలుసుకున్న అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. చరణ్-చిరంజీవి కలిసి ఫస్ట్ టైం మల్టీ స్టారర్ గా నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేశారు. ఖచ్చితంగా ఓ మాయ చేసేస్తాడు సినిమాతో అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

అయితే, చరణ్-చిరు-కొరటాల సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ ఎనర్జిటిక్ గా పాల్గొంటూ అభిమానులను ఉత్సాహ పరుస్తుంటే.. మరి కొందరు మెగా ఫ్యాన్స్ యాంటీ బ్యాచ్ కావాలనే సినిమా పై నెగిటీవ్ టాక్ రావడానికి నానా తంటాలు పడుతున్నారు. సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే గిట్టని వాళ్లు ఉన్న సంగతి కొత్తగా చెప్పనవసరం లేదు. ఎప్పుడెప్పుడు ఆ ఫ్యామిలి ని రోడు పైకి తీసుకొద్దామా అని కాచుకు కూర్చుని ఉంటారని అభిమానులు అంటుంటారు. అయితే, ఈ సారి ఆ సో కాల్డ్ బ్యాచ్..మెగా ఫ్యామిలీని డౌన్ చేయడానికి RRR ని ఉపయోగించుకుంది.

మనకు తెలిసిందే, రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన RRR సినిమాలో చరణ్-తారక్ హీరోలుగా నటించారు. సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. కానీ సినిమాలో చరణ్ నే హైలెట్ చేశారని..తారక్ ని తక్కువ చేసారన్న కామెంట్లు వినిపించిన..రాజమౌళి కధ లో పాత్రలు చూడండి..నేను ఏ హీరోని తక్కువ చేయలేదు అంటూ చెప్పకనే చెప్పేశాడు. ఇక్కడి తో ప్రాబ్లమ్ సాల్వ్..అనుకున్నారు అంతా.. కానీ , బ్యాండ్ భాజా బ్యాచ్ ఎంటర్ అయ్యి.. కరెక్ట్ గా ఆచార్య సినిమా కి కొద్ది గంటల సమయంలోనే మీడియో లో ఓ వీడియో ని హైలెట్ చేస్తూ ట్రెండింగ్ చేస్తుంది.

ముంబై లో జరిగిన RRR సక్సెస్ మీట్ లో ఓ రిపోర్టర్.. నేరుగానే..” ఈ సినిమా లో చరణ్ హైలెట్ అయ్యారు.. అని అంతా అంటున్నారు..దానికి మీ అభిప్రాయం”,,అంటూ ఓ ప్రశ్న సూటిగా వేశారు గుర్తుందా.. హా..ఇప్పుడు అదే వీడియోని నెట్టింట మళ్ళీ వైరల్ గా మారుస్తుంది ఓ పని లేని బ్యాచ్. కావాలనే ..ఆ వీడియో ని బ్యాడ్ గా చూయిస్తుంది. చరణ్ ఇమేజ్ ని డీ గ్రేడ్ చేయాలని..ఆచార్య ఫ్లాప్ అవ్వాల్ని..ఆ గ్రూప్ ఇలా చేస్తుంది అంటూ..మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో ఆచార్య రిజల్ట్ పై అందరికి డౌట్లు వస్తున్నాయి..మరి చూడాలి ఏమౌతుందో..?

Share post:

Latest