సుకుమార్ కి భయం స్టార్ట్ అయ్యిందిరోయ్..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరు హీరోలు, డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలు అంటూ కలవరిస్తున్నారు. అంతేనా భారీ కలెక్షన్స్ కోసం తీసిన సినిమాకే మరి కొంత కధను మిక్స్ చేసి..పార్ట్ 2 అంటూ కూడా తెరకెక్కిస్తున్న సినిమాలను మనం చూస్తున్నం. బాహుబలి సినిమా తరువాత ఇలాంటి సినిమా కధలు ఎక్కువైయాయి అనే చెప్పాలి. రీసెంట్ గా రిలీజ్ అయిన KGF 2 బాక్స్ ఆఫిస్ వద్ద సృష్టించిన సునామీ ఏంటో మనం కళ్లారా చూశాం. యాష్ యాక్టింగ్..మాస్ డైలాగ్స్..ప్రశాంత్ నీల్ క్రియేటివిటీ ..అబ్బో సినిమా పై మంచి కామెంట్స్ నే వినిపిస్తున్నాయి.

సినిమాలో ప్రతి షాట్ అధ్బుతంగా తెరకెక్కించాడు ప్రశాంత్. చిన్న సీన్ అయిన సరే ప్రజలకి అర్ధమైయేలా..చిత్రీకరించారు. డబ్బు విషయంలో వెనకడుగు వేయకుండా కోట్లు కుమ్మరించి..KGF 2 ని బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చోపెట్టారు. అంతేనా ప్రశాంత్ క్రియేటివిటి చూసి..జూనియర్ రాజమౌళి అంటూ కూడా బిరుదు ఇచ్చేశారు. ఏమాటకు ఆ మాట కొన్ని షాట్స్ లో రాజమౌళినే మించిపోయాదు ప్రశాంత్ అన్నది వాస్తవం.

అయితే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందరూ భారీ బడ్జెట్ సినిమాలి అంటూ కోట్లు ఖర్చు చేసి విజువల్ ట్రీట్ అందిస్తుంటే..మరి మిగతా సినిమాల పరిస్ధితి ఏంటి..అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుకుమర్ పార్ట్ 2 విషయంలో అస్సలు వెనకడుగు వేయకుండా..కధను కొత్త మలుపు తిప్పబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్ సైడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ కూడా పుష్ప లో భారీ విజువల్ ఎఫెక్ట్ సీన్స్ ఉండేలా స్టోరీని మార్చుకున్నారట. అంతేకాదు మార్చిన కధ కోసం సినిమాలోకి కొత్త నటీ నటులను కూడా తీసుకోనున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా ప్రశాంత్ KGF 2 కారణంగా సుకుమార్ కి కొత్త భయం పట్టుకుంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. చూడాలి పుష్ప 2 లో ఏ మాత్రం సక్సెస్ అవుతారో సుక్కు..?