‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’..సామ్ భళే ఇరుకుందే..?

యస్.. ఇప్పుడు సమంత పోజీషన్ అలానే ఉందంటున్నారు సినీ ప్రముఖులు. స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తున్న ఈ బ్యూటీ..వరుస సినిమాలకు కమిట్ అవుతూ సీనియర్ స్టార్స్ కి..ఎక్స్ పోజింగ్ విషయంలో అస్సలు తగ్గకుండా కుర్ర హీరోయిన్ లకి తెగ పోటీ ఇస్తుంది. ఇక విడాకుల తరువాత అయితే మరీ టూ మచ్ ఎక్స్ పోజింగ్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంకొందరు మరీ ఇంట్ హాట్ బాగోదు సామ్ అంటూ ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు. అయినా కానీ, సమంత తన పని తాను చేసుకుంటూపోతుంది.

ఆమె రీసెంట్ గా నటించిన తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మనకు తెలిసిందే సమంత, నయనతార, విజయ్ సేతుపతి లు లీడ్ రోల్స్ లో నయన్ బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ డైరెక్షన్లో నటించిన చిత్రం”కాత్తు వాక్కుల రెండు కాదల్‌”. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ మూవీ నయనతార, విఘ్నేష్‌లకు చెందిన రౌడీ పిక్చర్స్‌ సంస్థ, 7 స్ర్కీన్స్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రూపొందించిన స్వరాలు ఇప్పటికే సంగీతాభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ పనులను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు టీం. సినిమా ను తెరకెక్కించడం ఓ సమస్య అయితే ఆ సినిమా ప్రమోషన్స్ చేయడం మరో ఎత్తు. ఇక్కడ మెయిన్ సమస్య సమంత విడాకులు. నాగచైతన్య తో విడిపోయిన తరువాత ఫస్ట్ టైం హీరోయిన్ గా తెర పై కనిపించబోతుంది. ఖచ్చితంగా ప్రమోషన్స్ కి వెళ్లితే..నానా రకాల ప్రశ్నలు అడుగుతారు. సమంత ఏం చెప్పినా దానికి డబుల్ అర్ధాలు తీసి ట్రోల్స్ చేస్తారు. ఒక్కవేళ ప్రమోషన్స్ కి డుమ్మా కొడదామా అనుకుంటే..సమంత తప్పు చేసింది అందుకే ప్రమోషన్స్ చేయట్లేదు అంటారు. దీంతో ఇప్పుడు సమంత ఎటు తెల్చుకోలేకపోతుందట. మరి చూడాలి ఈ సమస్య ను సామ్ ఎలా సాల్వ్ చేసుకుంటుందో..?