దుప్పట్లో దడదడ.. ‘గోడకేసి గుద్దుడే’.. అందులో బూతుల పురాణం..!!

బిగ్ బాస్..ఇది ఒక రియాలిటీ గేమ్ షో. చాలా భాషల్లో ఈ షో బాగా పాపులర్ అయ్యింది. మన తెలుగులో కూడా ఐదు సీజన్స్ కంప్లీట్ చేసుకుని.. ప్రజెంట్ బిగ్ బాస్ OTT లో Telecast అవుతుంది. ఇన్నాళ్ళు ఒక్క గంట..లేద అన్ సీన్ ఎపిసోడ్స్ అంటూ మరో గంట చూసే బిగ్ బాస్… ఇప్పుడు 24 గంటలు లైవ్ లో Telecast అవుతుంది. పెద్దగా చెప్పుకొతగ్గ సెలబ్రిటీలు లేకపోయినా.. ఉన్న వారిలో కొంత మంది మంచి కంటెంట్ ఇచ్చే కంటెస్టేంట్లు చూస్ చేసుకుంది బిగ్ బాస్ మేనేజ్మేంట్. ఇక కొందరు ఇది వరకే బిగ్ బాస్ షో లోకి వెళ్లి వచ్చిన వారు కావడంతో అక్కడ జరిగే జిమ్మిక్ లు బాగా తెలుసు..కావడంతో ఫుల్ ఆడేసుకుంటున్నారు.

బిగ్ బాస్ oTT అంటే అందరికి గుర్తు వచ్చేది అఖిల్-బిందు గొడవలు..ఆషు రెడ్డి-అజయ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ . వామ్మో .. ఆ మాటలు వినలేం రా బాబు అన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. రీసెంట్ గా అయితే ఓ మెట్టు దిగ జారి..మరింత వల్గర్ గా..దుప్పట్లో దడదడ.. ‘గోడకేసి గుద్దుడే’ అన్న మాటలు మాట్లాడారు బిగ్ బాస్ కంటెస్టెంట్. దీంతో షో చూస్తున్న నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇది రియాలిటీ షో నా లేక మిడ్ నైట్ మసాలా షో నా అంటూ దుమ్మేతిపోస్తున్నారు. మాట్లాడే వాళ్ళకి సిగ్గులేకపోయినా..కనీసం పక్కన ఉన్న వాళ్ళకి అయినా లేదా అంటూ తొట్టి బ్యాచ్ ని ట్రోల్ చేస్తున్నారు.

బిందు-శివ రిలేషన్ షిప్ గురించి బయట ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియకుండా ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లు మాత్రం నీఛంగా మాట్లాడుతుండటం సెన్సేషన్ గా మారిపోయింది. ఇక అఖిల్, ఆషు, నటరాజ్ మాస్టార్, అజయ్..ఈ బ్యాచ్ అంతా గుమ్మికూడీ బిందు-శివ ల గురించి మాట్లాడిన ఓ కాన్వర్షేషన్ నెట్టింట వైరల్ గా మారింది.

అఖిల్ ఏమో.. శివ బిందు హీరో హీరోయిన్స్ అంటుంటే..అజయ్ మూవీ టైటిల్ అంటూ.. ‘దుప్పట్లో దడదడ’ అంటుంటారు మధ్యలో అషురెడ్డి ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట అనగా అప్పుడు అజయ్.. ‘గోడకేసి గుద్దుడే’ అంటున్న క్లిప్ వైరల్ గా మారింది. ఇక అక్కడే ఉన్న నటరాజ్ మాస్టర్ మాట్లాడిన మాటలకి బీప్స్ వేశారంటే ..పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో అర్ధంచేసుకోండి.. అంటూ ఆయనను నెట్టింట బాగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఎప్పటిలాగే నాగార్జున వచ్చి ఆషూరెడ్డి ని పొగిడి ..శభాష్ అంటూ బై బై చెప్పేసి వెళ్లిపోతారు. అంతేకానీ, ఈ మాటలు ఏంటి..ఇది పబ్లిక్ ప్లాట్ ఫాం అని బుద్ధి చెప్పుదాం అనే లేదు అంటూ హోస్ట్ పై కూడా విరుచుకుపడుతున్నారు జనాలు. ఇంకొందరు అయితే ఇది బిగ్ బాస్ కాదు బూతు పురాణం అని పెట్టాలి అంటూ పచ్చిగా తిడుతున్నారు.