వావ్: ఆచార్యలో అనుష్క..భళే ట్వీస్ట్ ఇచ్చారే..?

యస్.. ఇప్పుడు నెట్టింట ఇదే న్యూస్ ట్రేండింగ్ గా ఉంది. మొన్న నిన్నటి వరకు హీరోయిన్ కాజల్ అనుకున్న జనాలకు కొరటాల షాక్ ఇస్తూ..ఆమె సినిమా నుండి తప్పుకున్నిందని క్లారిటీ ఇచ్చాడు. మరి చరణ్ పక్కన హీరోయిన్ గా పూజా చేస్తే..చిరు పక్కన మెరిసిన ఆ భామ ఎవరు..అంటూ నెట్టింట ఓ ప్రశ్న పెద్ద దుమారమే రేపింది. ఇటు మెగా ఫ్యాన్స్ కూడా హీరోయిన్ లేకుండానే చిరు రోల్ కంప్లీట్ చేశాడా కొరటాలా అంటూ కసిరారు. కొందరు ఐటేం సాంగ్ లో చిందేసిన రెజీనా నే హీరోయిన్ అని కూడా అన్నారు.

కానీ, ప్రస్తుత టాక్ చూస్తుంటే అవన్నీ కాదు.. ఆచార్యలో మరో హీరోయిన్ కూడా ఉందని తెలుస్తుంది. టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి ..మెగాస్టార్ ఆచార్యలో అతిధి పాత్రలో కనిపించనున్నారనే టాక్ వైరల్ గా మారింది. ఈ విషయాని మేకర్స్ లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికి..అది బయటకు వచ్చేసింది. దీంతో అనుష్క రోల్ ఎలా ఉండబోతుంది..? ఆమె చిరు పక్కన హీరోయిన్ గా చేసిందా..? అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

ఇక తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా చిరు కి హీరోయిన్ లేరు. చిరు సింగిల్ గానే మనకు సినిమా కనిపిస్తారట. రెజీనా ఐటెం సాంగ్ లో చిందేసి.. ధర్మస్థలిలో ఓ ఐదు నిమిషాల క్యారెక్టర్ చేసిన్నట్లు తెలుస్తుంది. ఇక అనుష్క సంగతి కి వస్తే ఆమె ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించనుందని..కానీ ఆమె పాత్ర వల్లే చరణ్-చిరు జీవితాలల్లో భారీ మార్పులు వస్తాయని అంటున్నారు ఇన్ సైడ్ వర్గాలు. ఏది ఏమైనా కొరటాల ట్వీస్ట్ చాలా బాగుందంటున్నారు సినీ ప్రముఖులు. స్టార్ హీరో అనుష్క కూడా ఆచార్య కి జోడైతే.. ఇక బాక్స్ ఆఫిస్ వద్ద సునామీ పక్క అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి

Share post:

Latest