RRR: ఒట్టు..ఆ విషయం నాకు అస్సలు తెలీదు..శ్రియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఇద్దరు టాలీవుడ్ బడా హీరోలు..ఓ అందాల ముద్దుగుమ్మ..ఒక్క ఫ్లాప్ సినిమా పడకుండా సినీ ఇండస్ట్రీనే ఏలేస్తున్నా డైరెక్టర్.. తన స్వరాలాతో వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళే మ్యూజిక్ డైరెక్టర్.. కళ్ళు ఆర్పకుండా చూసే విజువల్ వండర్స్.. ఈ కాంబినేషన్స్ అన్ని సెట్ అయిన సినిమానే ఆర్ ఆర్ ఆర్..రణం రౌద్రం రుధిరం. దాదాపు రాజమౌళి నాలుగేళ్ళు పగలు రాత్రి కష్టపడి..చరణ్-తారక్ లను కష్టపెడుతూ..తను అనుకున్న విధంగా సీన్స్ వచ్చేవరకు టార్చర్ చేస్తూ..రూపొందించిన భారీ సినిమా RRR. ఈ నెల 25 న విడుదలైన ఈ RRR సినిమా దేశవిదేశాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది.

ఒక్క మాటలో చెప్పాలంటే బాక్సాఫీస్ పై దాడి చేస్తూ కలెక్షన్స్ పరంగా పలు రికార్డులు తిరగరాస్తోంది. జనరల్ గా రాజమౌళి సినిమా అంటే సరికొత్త రికార్డులు నెలకొల్పతారు అని తెలుసు..కానీ ఈ రేంజ్ లో హిట్ అవుతుందని.. ఇంతటి కలెక్షన్స్ సాధిస్తుందని అస్సలకి ఊహించలేదు ఎవ్వరు. సినిమాలో పెద్ద గా కంటెంట్ లేకపోయినా..తన మ్యాజిక్ తో మనల్ని మాయ చేశాడు ఈ మర్యాదరామన్న. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక ఓవర్‌సీస్, బాలీవుడ్ తెరలపై RRR ట్రెండ్ నడుస్తోంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనను ఎంజాయ్ చేస్తున్నారంతా.

కాగా, ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా కూడా.. ఓ చిన్న రోల్ పోషించింది. రాజమౌళి సినిమాలో పాత్ర చిన్నది-పెద్దది ఉండదు..కీలకం అయ్యుంటుంది.. అలాగె ఈ సినిమాలో శ్రియా రోల్ కూడా కీలకమైన రోల్ ఉంటాది అని అనుకున్నారంతా..కానీ రాజమౌళి ఈ సినిమా లో ఆమెను బిస్కెట్ చేశారు. ఆమెలోని టాలెంట్ ను వాడుకోలేకపోయాడు. కాగా రీసెంట్ గా RRR సక్సెస్ అయిన సంధర్భంగా ఓ ఆంగ్ల పత్రికతో శ్రియా మాట్లాడుతూ ..”RRR సినిమాలో నేను ఓ భాగమైనందుకు హ్యాపీగా ఉంది. రాజమౌళి సార్ దర్శకత్వంలో నేను ఇదివరకే ఓ సినిమా చేశా. ప్రభాస్ హీరో గా వచ్చిన సినిమా ఛత్రపతి లో హీరోయిన్ గా చేశాను. అది నా కెరీర్లోనే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందీ . ఆ తర్వాత మళ్లీ కాంబినేషన్ కుదరలేదు. ఇదిగో ఇప్పుడు మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా పుణ్యమా అంటూ ఆయన డైరెక్షన్ లో కీలకపాత్రలో నటించే అవకాశం వచ్చింది. కధ కూడా వినకుండానే రాజమౌళి సినిమా అనగానే ఒకే చెప్పేశాను.. నా పాత్ర.. నాతోపాటు ఎవరెవరు చేస్తున్నారు. హీరోహీరోయిన్స్ ఎవరు అనేది తెలుసుకోలేదు. నిజం చెప్పాలంటే షూట్ ప్రారంభమైన తర్వాత నే నాకు తెలిసింది..ఈ సినిమాలో హీరోలుగా రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారని అలియా హీరోయిన్ గా నటింస్తుందని”..అంటూ చెప్పుకొచ్చింది.