RRR కాదు.. NTR రికార్డులు ఖాయం!

టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ రాజమౌళి మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ఫిక్స్ అయ్యారు అభిమానులు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఆర్ఆర్ఆర్‌తో రాబోయే రికార్డులన్నీ కూడా ఎవరికి ఎక్కువగా ఉపయోగపడతాయంటే.. అది ఖచ్చితంగా తారక్‌కే అని చెప్పాలి. మరో హీరో అయిన రామ్ చరణ్‌కు ఆల్రెడీ ‘మగధీర’ వంటి ఇండస్ట్రీ హిట్‌ను అందించాడు జక్కన్న. దీంతో ఈసారి ఎలాగైనా తారక్‌కు తన కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వాలని కసిగా ఈ ప్రాజెక్ట్‌ను తీసుకున్నాడట ఈ స్టార్ డైరెక్టర్. అనుకున్నట్లుగానే ఈ సినిమాలో తారక్ పాత్రను కూడా అంతే పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దాడట.

వెండితెరపై తారక్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా కావడం ఖాయమని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా మిగలడం.. అది ఎన్టీఆర్ కెరీర్‌లో బెస్ట్‌గా మారడం రెండూ ఒకేసారి జరిగిపోతాయని ఆయన భావిస్తున్నాడట. అటు ఈ సినిమాతో ఎన్టీఆర్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చాలనే జక్కన్న కల కూడా ఆర్ఆర్ఆర్ నెరవేరుస్తుందట. మొత్తానికి ఈ అంశాలన్నీ చూస్తుంటే ఇండియన్ బాక్సాఫీస్‌పై పంజా విసిరేది RRR కాదు.. NTR అని అనిపిస్తోంది. మరి దీనిపై మీరేమంటారు?