ఆస్ట్రేలియాలో తారక్ ఫ్యాన్స్ రచ్చ.. క్రేజ్ కా బాప్!

మాస్ కా బాప్.. అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఆయన అభిమానులు ఓ దేవుడిలా కొలుస్తుంటారు. అయితే ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ మరో రెండు రోజుల్లో యావత్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని తారక్ అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. కాగా తాజాగా ఈ సినిమా కోసం, తమ అభిమాన హీరో రాక కోసం అభిమానులు ఎంతలా వేచిచూస్తున్నారో తమ అభిమానాన్ని చాటి చెప్పారు ఆస్ట్రేలియాలోని ఎన్టీఆర్ అభిమానులు.

తమ అభిమాన హీరోపై ప్రేమను అత్యంత క్రేజీగా చూపించారు అక్కడి అభిమానులు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 70 కార్లతో తారక్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ‘జై ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్’ అని ఇంగ్లీష్‌లో అక్షరాలు వచ్చేలా కార్లతో రెచ్చిపోయారు తారక్ డైహార్డ్ ఫ్యాన్స్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఏదేమైనా దాదాపు మూడేళ్ల తరువాత తారక్ బొమ్మ వెండితెరపై పడుతుండటంతో ఆయన అభిమానులు టైగర్ ఎంట్రీ కోసం ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ఈ క్రేజ్ చూస్తే అర్థమవుతోంది. ఇక కొమురం భీం పాత్రలో తారక్ పర్ఫార్మెన్స్ ఆర్ఆర్ఆర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు, జక్కన్న తారక్‌ను ఈ సినిమాతో పాన్ వరల్డ్ స్టార్‌గా మార్చబోతున్నట్లు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.