పుష్ప-2 ఇప్పట్లో లేనట్టేనా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సూపర్ హిట్ మూవీగా నిలిచిందో మనం చూశాం. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించగా, ఈ సినమాను ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, బన్నీ ఓ ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించడంతో ఈ సినిమాలో ఆయన పర్ఫా్ర్మెన్స్‌కు ప్రేక్షకులు పట్టం కట్టారు.

ఇక పాన్ ఇండియా మూవీగా వచ్చిన పుష్ప చిత్రానికి అన్ని చోట్లా బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్టు పనుల్లో దర్శకుడు సుకుమర్ బిజీగా ఉన్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్‌ను జూన్ నెలలో ప్రారంభించాలని చిత్ర యూనిట్ తొలుత భావించింది. కానీ ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ కోసం లొకేషన్ల వేటలో సుకుమార్ చాలా సమయం తీసుకుంటున్నాడని, దీంతో ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. బన్నీ ఊరమాస్ పాత్రలో పుష్పరాజ్‌గా తనదైన మార్క్ యాక్టింగ్‌తో మరోసారి దుమ్ములేపేందుకు పుష్ప-2 చిత్రాన్ని రెడీ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోండగా, టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి పుష్ప-2 చిత్రం ఎప్పుడు షూటింగ్ మొదలుపెడుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.