RRR చిత్రాన్ని మిస్ చేసుకున్న హాలీవుడ్ – బాలీవుడ్ స్టార్ ముద్దుగుమ్మలు..!!

రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కించిన ప్రతిష్టాత్మకమైన చిత్రం RRR. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం ఐదు రోజుల్లోనే ఈ సినిమా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ల తో పాటుగా ఓవర్సీస్ రికార్డు స్థాయిలో కలెక్షన్ల ను సొంతం చేసుకుంది.. సీతా రామ రాజు.. కొమరం భీమ్ పాత్రలో చరణ్ , తారక్ ఎంతో అద్భుతంగా నటించారు. చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ నటించగా, ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలీవియా మోరిస్ నటించింది.

అయితే ఈ చిత్రంలో ముందుగా సీత పాత్ర కోసం కొంతమంది మేకర్స్ మొదట సాహో సినిమాలో నటించిన శ్రద్ధ కపూర్ ను సంప్రదించారట.. అయితే ఆమె వేరే కారణాల వల్ల ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు. అయితే తన డేట్స్ అడ్జస్ట్ కాలేకపోవడం వల్ల ఈ సినిమాలో ఒప్పుకోలేదు అన్నట్టు గా సమాచారం. ఆ తర్వాత మేకర్లు మరొక హీరోయిన్ పరిణీతి చోప్రాను సంప్రదించారు.


అయితే సీత పాత్రకు డేట్స్ కేటాయించే విషయంలో ఇబ్బందులు ఎదురు కావడంతో పరిణిత చోప్రా ఈ ఆఫర్ ను వదులుకున్న ట్లు సమాచారం. అయితే మరొక హీరోయిన్ అమీ జాక్సన్ కూడా అడగగా ఆమె గర్భవతి కావడం వల్ల ఆ ఆఫర్ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. చివరిగా ఆ పాత్ర ఆలియా భట్ ను వరించింది. జెన్నీ పాత్ర కోసం హాలీవుడ్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ ను తీసుకున్నారు అయితే కొన్ని కారణాల వల్ల ఆమె కూడా ఈ సినిమా నుంచి తప్పు కున్నది.


ఎట్టకేలకు చివరిగా ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్ కు జోడీగా నటించింది. అయితే చరణ్ కు ఆలియాభట్, ఎన్టీఆర్ కు ఓలివియా మోరీస్ జోడి బాగుంటుందని నెటిజన్లు కూడా అభిప్రాయ పడడంతో వీరిని ఓకే చేశారు రాజమౌళి. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ అంచనాలను మించిపోయి విజయాన్ని అందుకుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.