జ‌క్క‌న్న‌ను బెదిరించిన తార‌క్ ఫ్యాన్స్‌.. అస‌లేం జ‌రిగింది..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే స్థాయిలో ఉన్న స్టార్ హీరోలతో సినిమా తెరకెక్కించే సత్తా కేవలం రాజమౌళికి మాత్రమే ఉందని చెప్పవచ్చు. అయితే అలాంటి మల్టీ స్టారర్ సినిమాలో నటించే తమ ఫేవరేట్ హీరో కు ప్రాధాన్యత కొంచెం తగ్గినా కూడా ఫ్యాన్స్ ఫీలవుతారన్న సంగతి అందరికీ తెలిసినదే.. అయితే ఇక RRR చిత్రంలో ఎన్టీఆర్ పాత్రకు ప్రాధాన్యత తగ్గింది అని తారక్ అభిమానులు చాలా ఫీలవుతున్నారు. తన పాత్ర విషయంలో RRR సినిమా ద్వారా తనకు వచ్చిన పేరు విషయంలో పూర్తి స్థాయిలో సంతృప్తి గా ఉన్నారని తారక్ చెప్పినప్పటికీ కూడా ఆయన అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో తమదైన శైలిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చరణ్ , తారక్ పాత్రలలో బ్యాలెన్స్ చేసే విషయంలో జక్కన్న కొన్ని పొరపాట్లు చేశారని తారక్ అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. అయితే ఈ విషయంలో హర్ట్ అయిన కొంతమంది అభిమానులు సైతం రాజమౌళికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు అని.. జక్కన్న ను అసభ్యకరంగా తిట్టారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో మాత్రం రాజమౌళి స్పందిస్తే అసలు నిజాలు బయటికి వస్తాయని చెప్పవచ్చు.

ఇక RRR చిత్రం యూఎస్ లో ఇప్పటికే 10 మిలియన్ డాలర్లను సంపాదించింది. ఇక అక్కడ సినిమా ముగిసే సమయానికి డిస్ట్రిబ్యూటర్లకు భారీ స్థాయిలో లాభాలను అందిస్తుందని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కు చాలా దగ్గర సన్నిహితుడు రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. అయితే రాజమౌళి వల్లే తను ఈ స్థాయిలో ఉన్నానని ఎన్టీఆర్ పలు సందర్భాలలో తెలియజేశారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జక్కన్న కాంబినేషన్లో నాలుగు చిత్రాలు వచ్చాయి.

ఒకానొక సందర్భంలో రాజమౌళి కూడా తను నిర్మించే సినిమాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగల హీరో కేవలం జూనియర్ ఎన్టీఆర్ అని స్వయంగా వెల్లడించడం జరిగింది. ఎన్టీఆర్ నాలుగేళ్లు RRR సినిమాకి పరిమితమైనా.. చరణ్ హైలెట్ అయిన స్థానంలో.. ఎన్టీఆర్ హైలెట్ కాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై ఎలా స్పందిస్తాడో జక్కన్న చూడాలి.