RRRలో తారక్‌ను తగ్గించారు.. ఎందుకో?

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తెరకెక్కించగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమాను చూసిన ఆడియెన్స్‌లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా నందమూరి అభిమానులు ఈ సినిమమా చూసి జక్కన్నపై మండిపడుతున్నారు. ఇంతకీ వారు జక్కన్నను ఎందుకు టార్గెట్ చేస్తున్నారా అని అనుకుంటున్నారా..

ఆర్ఆర్ఆర్ సినిమా చూసినట్లయితే, రామరాజు పాత్రలో చరణ్ స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువగా ఉందని, కొమురం భీంగా తారక్ స్క్రీన్ ప్రెసెన్స్ కొంత తగ్గిందని వారు అంటున్నారు. అయితే నటనా పరంగా మాత్రం ఎన్టీఆర్ ఇరగదీశాడని.. కానీ తెరపై ఆయన్ని ఇంకా ఎక్కువగా చూపించి ఉంటే బాగుండేదని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తు్న్నారు. అటు ఫస్టాఫ్‌లో తారక్ పాత్రను హైలైట్ చేసిన జక్కన్న, సెకండాఫ్‌లో మాత్రం చరణ్‌నే హైలైట్ చేశాడని.. దీంతో తారక్ పాత్రను తక్కువగా చూపించారని వారు అంటున్నారు.

కాగా సెకండాఫ్ నుండి క్లైమాక్స్ వరకు చరణ్ పాత్రకు జక్కన్న ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చాడని, దీంతో తారక్ పాత్ర సైడ్ అయ్యిందని వారు మండిపడుతున్నారు. ఏదేమైనా ఆర్ఆర్ఆర్‌లో తమ హీరోను తగ్గించారని తారక్ అభిమానులు అంటుండటంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది కొత్త చర్చకు దారితీస్తోంది. అయితే చరణ్ అభిమానులు మాత్రం ఇద్దరు హీరోలకు సమానమైన ఇంపార్టెన్స్ ఇచ్చారని అంటున్నారు. మరి ఈ వివాదం ఇంకా ముందుకెళ్తుందా లేక అభిమానులు సైలెంట్ అవుతారా అనేది చూడాలి.