కేవలం ఆ ఒక్క రీజన్ వల్లే నేను ఫెయిల్యూర్‌ని.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్..!!

దేశవ్యాప్తంగా ఉన్న మెగా అండ్ నందమూరి అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కానుంది. దాదాపు దర్శక ధీరుడు రాజమౌళి నాలుగేళ్లు పడిన కష్టం మనం తెర పై చూడబోతున్నాం. ఆయన సినిమాలో ని మ్యాజిక్ ని మరికొన్ని రోజుల్లోనే మనం తెర పై చూడబోతున్నాం అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించిన పోస్టర్స్ ను షేర్ చేస్తూ..హంగామా చేస్తున్నారు. మార్చి 25న భారీ స్థాయిలో విడుదల కాబోతోన్న ఈ పాన్‌ ఇండియా చిత్రం కోసం ప్రపంచ దేశాల తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ కావడంతో రాజమౌళి అన్ని భాషలను కవర్ చేస్తూ..ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో చేస్తున్నారు. కేవలం ఇండియాలోనే కాకుండా దుబాయ్‌ లాంటి పెద్ద పెద్ద దేశాలల్లో కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు చిత్ర బృందం. ఈ మధ్యనే బెంగుళురులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన RRR Team..సినిమా పై కొత్త అప్డేట్స్ ఇస్తూ..అభిమానుల అంచనలను పెంచేస్తున్నారు. రీసెంట్‌గా మరో ఈవెంట్‌లో పాల్గోన్న దర్శక ధీరుడు రాజమౌళి ఈ సంధర్భంగా RRR సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు.

ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ ..”నేను ఏ హీరోని కూడా చూస్ చేసుకునేటప్పుడు ఆ హీరో పాపులారిటీని చూడను. కేవలం అతను నా సినిమాలోని పాత్రకు సూట్ అవుతాడా లేదా అనే చూస్తా..అది చరణ్ కావచ్చు, తారక్ కావచ్చు, ఆలియా కావచ్చు..నేని ఈ సినిమాకి వీళ్లని ఎంపిక చేసుకున్నప్పుడు.. నా ఫోకస్‌ అంత పాత్రల మీదే ఉంది. వారి పాపులారిటి మీద కాదు. వారిని తెరపై సమానంగా ఎలా చూపించాలో మత్రమే ఆలోచిస్తాను కానీ అతను పెద్ద హీరో ఇలా చూపిస్తే అభిమానులు లైక్ చేయరు..అని నా కధను తక్కువ చేసుకోను. నా కధ చెప్పిన్నట్లే నేను ఫాలో అవుతా. అందుకే ఫిల్మ్‌మేకర్‌గా నేను ఫెల్యూయిర్‌ని’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ” అభిమానులు వాళ్ల ఫెవరేట్ హీరో కోసమే సినిమా చూడటానికి వస్తారు. కానీ ఈ సినిమాలో మీరు తారక్ చరణ్ లను పూర్తి గా మర్చిపోతారు. కొమురం భీంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతరామారాజుగా రామ్‌..ఊ కథలోని పాత్రలు ప్రేక్షకుడు ఫీల్‌ అయ్యేలా ఉంటాయన్నాడు జక్కన్న. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో..?