తల్లి కాబోతున్న మరో స్టార్‌ హీరోయిన్‌..సైలెంట్ షాకిచ్చిన అందాల ముద్దుగుమ్మ..!!

ఆడవాళ్లకి మాతృత్వం అనేది గొప్ప వరం. అందరు ఆ వరాని స్వీకరించాలి అనుకుంటారు . ఏ అమ్మాయి కూడా తల్లి అవ్వకూడదు అని కోరుకోదు. ప్రతి ఆడపిల్ల తన జీవితంలో మాతృత్వం పొందాల్సిందే. దానికి హీరోయిన్స్ కూడా అతీతులుకారు. అందం కోసం..కొన్ని సంవత్సరాలు ప్రెగ్నెన్సి ని పోస్ట్ పోన్ చేసుకున్నా..ఆ తరువాత చాలా మంది హీరోయిన్లు పిల్లలను కనేసి ..లైఫ్ లో బాగా సెటిల్ అయ్యారు. ఈ మధ్యనే టాలీవుడ్ పంచదార బొమ్మ కాజల్..తాను తల్లి కాబోతున్న విషయాని అఫిషియల్ గా చెప్పిన సంగతి తెలిసిందే.

తన చిన్న నాటి స్నేహితుడు గౌతమ్ కిచ్చులు ని పెళ్లి చేసుకున్న కాజల్ కనీసం పిల్లల విషయంలో నాలుగేళ్ళు అయినా గ్యాప్ తీసుకుంటుంది అని అనుకున్నారంతా కానీ..ఎవ్వరు ఊహించని విధంగా తల్లి కాబోతున్న విషయాని తెలియజేసింది. అంతేకాదు ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..అభిమానులను ఉత్సాహ పరుస్తుంటుంది. కాగా, తాజాగా మరో స్టార్ హీరోయిన్ కూడా అమ్మ అని పిలిపించుకోవడానికి సిద్ధపడింది. యస్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్‌ కపూర్‌ తల్లి కాబోతుంది.

బాలీవుడ్ బడా హీరో అనిల్‌ కపూర్‌ గారాల పట్టి ఈ స్టార్ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ అన్న సంగతి తెలిసిందే. సినిమా లో హీరోయిన్ గా తనదైన స్టైల్ లో నటించి..మెప్పించిన..ఈ బ్యూటీ త్వరలోనే తల్లిగా ప్రమోషన్‌ పొందనుంది. మనకు తెలిసిందే 2018లో ప్రముఖ బడా వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజా తో ఏడు అడుగు నడిచి కొత్త బంధాని ఏర్పర్చుకుంది. అప్పట్లో వీళ్ల పెళ్లి ఎంతో గ్రాండ్ గా బాలీవుడ్ ప్రముఖులు సైతం షాక్ అయ్యేలా చేశారు. కాగా ఆమె ఇప్పుడు ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ గుడ్ న్యూస్ ను సోనమ్‌ తన సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది. బేబీబంప్ తో భర్త ఒడిలో ఉన్న ఫొటోలను షేర్‌ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఆమె ఈ ఫోటో క్రింద రాసుకొస్తూ ‘నిన్ను పెంచడానికి అన్ని మా నాలుగు చేతుల్లో ఉన్నాయి. నీ రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాం’ అంటూ తన పోస్ట్ చేసింది సోనమ్‌. దీంతో ఆనంద్‌ అహుజా-సోనమ్‌ కపూర్‌ జంటకు ప్రముఖుల నుండి కంగ్రాట్స్ విషెస్ అందుతున్నాయి.