చంటి సినిమా ఫస్ట్ ఛాయిస్ వెంకటేష్ కాదట..

చంటి.. టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ మూవీ. విక్టరీ వెంకటేష్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు నిర్మించిన చిత్రం. రామారావు బ్యానర్ లో వచ్చిన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమా ఇది. 1892 జనవరి 10న విడుదలై ఘన విజయాన్ని అందుకున్న మూవీ. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు 30 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత రామారావు ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

ఈ సినిమా తమిళంలో తెరకెక్కిన చిన్న తంబి అనే సినిమా నుంచి రీమేక్ చేశారు. తొలుత ఈ సినిమాను తెలుగులో తీయాలని భావించి దర్శకుడిగా రవి రాజాను పిక్స్ చేసినట్లు చెప్పాడు. ఈ సినిమాలో హీరోగా రాజేంద్ర ప్రసాద్ తో పాటు మరికొంత మందిని అనుకున్నట్లు వెల్లడించాడు. అదే సమయంలో సురేష్ బాబు కలుగజేసుకుని వెంకటేష్ తో తీస్తే బాగుంటుంది అని చెప్పాడట. ఆయన డేట్స్ ఇస్తే చెయ్యడానికి నాకు ఓకే అని రామారావు వెల్లడించాడట. విషయం వెంకీకి తెలిసి ఓకే చెప్పాడట. ఈ సినిమాలో తన పాత్రకోసం చాలా కష్టపడ్డాడట చంటి. అప్పటి వరకు ఉన్న ఇమేజ్ ఈ సినిమాతో ఓ రేంజిలో పెరిగిందట. మీనా కూడా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తను కూడా స్టార్ హీరోయిన్ గా మారింది.

ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఉందట. ఈ సినిమా కోనసీమలో జరుగుతున్నట్లు చూపించినా.. అక్కడ ఈ సినిమా కోసం చేసిన షూటింగ్ చాలా తక్కువ అన్నాడు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే ఎక్కుడగా చిత్రీకరించినట్లు వెల్లడించాడు. హైదరాబాద్ లోనూ ఓ పాటను రూపొందించినట్లు చెప్పాడు. కానీ జనాలు మాత్రం సినిమా అంతా కోనసీమలోనే జరిగినట్లు భావిస్తారని చెప్పాడు. ఈ విషయంలో దర్శకుడి ప్రతిభ అద్భుతం అన్నాడు. రవిరాజా దర్శకత్వ గొప్పతనం, వెంకటేష్ హార్డ్ వర్క్, మీనా అందం.. ఇళయరాజా మ్యూజిక్ ఈ సినిమాకు అదనపు అసెట్స్ అని వెల్లడించాడు.