అయ్యో.. సమంతా ..ఎందుకు ఇంత అయోమయం !

సమంతా.. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ సంచలన హీరోయిన్. తన వ్యక్తిగత జీవితంతో పాటు సినిమాల విషయంలోనూ తను తీసుకునే నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఆమె చేసే కామెంట్స్.. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఏదో ఓ కొత్త విషయాలను వెల్లడిస్తూనే ఉన్నాయి. కొంత కాలం క్రితం తన భర్త నాగ చైతన్యకు విడాకులు ఇచ్చింది. పెళ్లై నాలుగేళ్లు నిండాక వివాహ బంధానికి గుడ్ బై చెప్పింది. ఇప్పుడే కాదు.. గతంలోనూ తను ఇచ్చిన పలు స్టేట్ మెంట్స్ ఆశ్చర్యకరంగా ఉండేవి. విడాకుల అనంతరం సినిమాలకు బ్రేక్ చెప్తున్నట్లు వెల్లడించింది. అంతకు ముందే సోషల్ మీడియాలో తన పేరు ముందున్న అక్కినేని పేరును తొలగించింది. అప్పుడే భార్య భర్తల మధ్య ఏదో తేడా జరిగిందనే మాటలు వినిపించాయి. కొద్ది రోజుల తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారనే టాక్ బయటకు వచ్చింది. వెంటనే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అక్టోబర్2న భార్య భర్తలు ఇద్దరు విడిపోతున్నట్లు ప్రకటించారు.

వాస్తవానికి వీరి విడాకులకు అసలు కారణం ఏంటని వారి అభిమానులు ఆరా తీశారు. పలు కథనాలు కూడా వచ్చాయి. వీరి విడాకులకు అవే కారణం అనే మాటలు వినిపించాయి. సమంతా కారణంగానే ఈ విడాకులు అని నెటిజన్లు నిందించారు కూడా. ఈ విషయంపై సమంతా వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. అంతేకాదు.. నాగ చైతన్య టార్గెట్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేది. అసలు సమంతా ఏం చెప్పాలి అనుకుంటుంది? అనే విషయంపై జనాలు చర్చించే వారు. నాగ చైతన్య మాత్రం సైలెంట్ గా ఉండేవాడు. విడాకుల తర్వాత నాగ చైతన్య లవ్ స్టోరీ అనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నా తన విడాకులు విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు.

సమంతా మాత్రం ఎప్పుడో ఒకసారి.. ఏదో ఒక కామెంట్ చేస్తూ పలు చర్చలకు దారి తీస్తూనే ఉంది. తాజాగా అక్టోబర్2న పోస్టు చేసిన విడాకుల పోస్టును కూడా తొలగించింది. అటు నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను కూడా డిలిట్ చేసింది. అయితే విడాకుల ప్రకటన ఎందుకు తొలగించింది? అనే విషయంపై టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. అటు సమంతా మాత్రం వరుస సినిమాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్ లను కూడా చేస్తుంది.