త్రిబుల్ ఆర్ సినిమా లో.. నాకు ఆ హీరో పాత్ర ఎక్కువగా ఇష్టం?

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా కు సంబంధించిన చర్చ ఎక్కడ చూసినా వినిపిస్తోంది. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని కొందరు.. ఈ సినిమాలో ఇద్దరు హీరోల పాత్రలు ఎలా ఉండబోతాయో అని మరికొందరు.. ఇలా ప్రేక్షకులందరూ త్రిబుల్ ఆర్ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. జనవరి 7వ తేదీన విడుదల కావలసిన ఈ సినిమాని మార్చిలో విడుదల చేయబోతున్నట్లు త్రిబుల్ ఆర్ చిత్రబృందం ప్రకటించింది. త్రిబుల్ ఆర్ సినిమా లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా.. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.

 

ఇక ఇద్దరికీ కూడా మాస్ ఫాలోయింగ్ ఒకే రేంజిలో ఉండటం గమనార్హం. ఇక ఇద్దరు హీరోలు కూడా డాన్సుల్లో తోపులే.. ఇక యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఎవరికి వారు ఇరగదీస్తా ఉంటారు ఇక ఇటీవల విడుదలైన త్రిబుల్ ఆర్ ట్రైలర్ లో కూడా ఎవరికి వారు అద్భుతంగా పాత్రకి ప్రాణం పోసారు అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోలు స్వతంత్ర సమర యోధుల పాత్రల్లో నటిస్తూ ఉండటంతో ప్రేక్షకులు కూడా ఈ పాత్రలను ఎక్కడ పోల్చి చూడడం లేదు. కానీ ఇక త్రిబుల్ ఆర్ సినిమా లోని రెండు పాత్రలలో తనకు ఏ పాత్ర అంటే ఎక్కువ ఇష్టం అనే విషయాన్ని ఇటీవల రాజమౌళి చెప్పుకొచ్చారు.

త్రిబుల్ ఆర్ ప్రమోషన్ సమయంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఈ క్రమంలోనే మీకు ఏ పాత్ర ఇష్టం అంటూ అడగగా నాకు ఇద్దరు హీరోలు చేసిన పాత్రలు ఇష్టమే. కానీ అల్లూరి సీతారామరాజు పాత్ర ఒకింత ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఈ పాత్రలో ఎమోషన్ బాగుంటుంది అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇక దర్శక ధీరుడు జక్కన్న నుంచి ఈ మాట రావడంతో చరణ్ అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోతున్నారు. కాగా అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ ఒదిగి పోయాడు అన్న విషయం తెలిసిందే.