“పుష్ప” శ్రీవల్లి సాంగ్ కి ఏకంగా స్టెప్పులు వేసిన నరేంద్ర మోడీ..!

అల్లు అర్జున్ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప క్రియేటివ్ చేస్తున్న రికార్డ్స్ అందరకి తెలిసిందే . పుష్ప యాంగ్ఓవర్ నుండి అభిమానులు ఇంకా బయటకి వచ్చినట్లు లేదు .ఎందుకంటే ఈ సెన్సేషన్ ఇంకా కొనసాగుతున్న సంగతి మనమందరం చూస్తూనే ఉన్నాము. సినిమా రిలీజ్ అయినప్పుడు నుండి పుష్ప సినిమాలోని డైలాగ్స్ ,సాంగ్స్లో పుష్ప మేనరిజం సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో హల చల్ అవుతున్నాయి .. .సెలెబ్రిటీలో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉన్నది . తగ్గేదే లే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే ,నిన్న కాకుండా మొన్న క్రికెటర్స్ తగ్గేదే లే డైలాగ్ తో సోషల్ మీడియాలో ఎంత హల చల్ చేసారో మనం చూశాం.ఆ డైలాగ్ తరువాత శ్రీవల్లి సాంగ్ అంతే పాపులర్ అయింది .నిన్ననే ఈ సాంగ్ హిట్ ట్రాక్ కి ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ బన్నీ సిగ్నేచర్ స్టెప్ వెయ్యగా అది కాస్తా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయింది .

ఇక ఇప్పుడు రాజకీయ నాయకులూ ఈ ట్రెండ్ ఫాలో చేస్తున్నారు . ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకో వీడియో ఒకటి వచ్చి వాట్సాప్ ట్విట్టర్ యూనివర్సిటీ లలో వైరల్ అవుతుంది. అయితే ఈసారి ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీనే స్టెప్పేసారు.దేశం లో జరిగిన ఎలక్షన్స్లో బాహుబలి లో డైలాగ్స్ మోడీ నోటా మనం విన్నాం . మోడీ ఈ డైలాగ్స్ కాదు ఏకంగా సాంగ్ కి స్టెప్స్ వేశారు .అయితే ఇది నిజంగా చేసింది కాదు కొంత మంది క్రియేటివ్ మైండ్స్ లో కార్టూన్ రూపంలో మోడీని క్రియేట్ చేసి పుష్ప రాజ్ స్టెప్ వేయించడమే కాకుండా లాస్ట్ లో తగ్గేదేలే మూమెంట్ కూడా చూపించారు. దీనితో ఎంతో ఫన్ గా అనిపిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.