శ్రీదేవి – రేణుదేశాయ్‌లా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు…!

చాలా మంది హీరోయిన్లు పెళ్లికి ముందే హీరోలతోనూ, దర్శకులతో… వ్యాపారవేత్తతో ప్రేమలో పడటం లేదా డేటింగ్‌ల‌లో మునిగి తేలడం చూస్తూ ఉంటాం. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాలలో చాలా మంది హీరోయిన్లు పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యారు. ఈ కల్చర్ ఇప్పుడు మాత్రమే కాదు నాలుగైదు దశాబ్దాల నుంచి భారత సినీ రంగంలో ఉంది. ఇలా పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయిన వారు గొడవలు… విభేదాలు రానంతవరకు సహజీవనం చేస్తూ ఉంటారు. పెళ్లికి ముందే వారి మధ్య బేధాభిప్రాయాలు వస్తే విడిపోతారు. లేకపోతే పెళ్లి చేసుకుంటారు… పెళ్లి తర్వాత మనస్పర్థలు వచ్చి విడిపోయినవారు కూడా ఉన్నారు. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శ్రీదేవి అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న ఓ స్టార్ హీరోయిన్. శ్రీదేవి సౌతిండియాలో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తక్కువ సమయంలోనే వరుస సూపర్ హిట్లతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ క్రమంలోనే నిర్మాత బోనీకపూర్ తో ప్రేమలో పడి పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది. శ్రీదేవి పెళ్లి సమయంలో శ్రీదేవి ఏడునెలల గర్భవతి అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. విచిత్రమేంటంటే అప్పటికే బోనీక‌పూర్‌కు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు.

రేణు దేశాయ్ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన బద్రి సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రేణు దేశాయ్ ఆ తర్వాత అదే పవన్ కళ్యాణ్ జానీ సినిమాలో కూడా నటించింది. వీరిద్దరూ సహజీవనం చేయడంతో 2004లో వీరికి అకీరానందన్ అనే అబ్బాయి కూడా పుట్టాడు. పెళ్లి చేసుకోకుండానే రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ తో పిల్లలను కంది. ఆ తర్వాత 2009లో వీరిద్దరూ అధికారికంగా పెళ్లి చేసుకున్నారు. ఇక అప్ప‌టికే వ‌ప‌న్‌కు నందిని అనే అమ్మాయితో పెళ్ల‌య్యి విడాకులు కూడా అయ్యాయి. ఆ త‌ర్వాత రేణు – ప‌వ‌న్ కూడా విడిపోగా.. ప‌వ‌న్ అన్నా లెజ్నోవాను మూడో పెళ్లి చేసుకున్నాడు.

సారిక యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో ప్రేమాయణం కొనసాగించిన… అప్పటికి స్టార్ హీరోయిన్ సారిక కమల్‌తో కలిసి కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం చేసింది. అలా పెళ్లికి ముందే సారిక ప్రెగ్నెంట్ అయింది. శృతిహాసన్ కడుపులో ఉండగానే సారిక – కమల్ ను పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే కమల్‌కు వాణి గణపతితో పెళ్లి అయి విడాకులు కూడా వచ్చేశాయి. అలాగే పరదేశి సినిమాతో పాపులర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న మహిమా చౌదరి సైతం 2006లో బాబీ ముఖర్జీని పెళ్లి చేసుకుంది. అయితే అంతకు ముందే ఆమె ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు.

సీనియర్ బాలీవుడ్ నటి నీనా గుప్తా వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ తో డేటింగ్ చేసి ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వీరిద్దరి మధ్య కూడా పెళ్లి జరగలేదు. అలాగే కొంకణాసేన్ – సెలీనా జెట్లీ – ట్వింకిల్ ఖన్నా వంటి హీరోయిన్లు కూడా పెళ్లికి ముందే పేరెంట్ అయినా వారి లిస్టులో ఉన్నారు. అయితే వీరు మాత్రమే కాదు… ఇండస్ట్రీలో పెళ్ళికి ముందే గర్భవతులు అయిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం తాము గర్భవతులం అన్న విషయాన్ని రహస్యంగా ఉంచారు. మరికొందరు మాత్రం తాము గర్భవతి అన్న విషయం బయటకు వచ్చిన వెంటనే పెళ్లి చేసుకున్నారు.