ఏడు సినిమాల్లో ఏడు డిఫరెంట్ రోల్స్.. సత్తా చాటబోతున్న రకుల్..

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే హీరో ఆడిపాడటానికే పరిమితం అయ్యేవారు. రాను రాను కేవలం అందాల ఆరబోతకే ఎక్కువ మొగ్గు చూపేలా చూశారు. కానీ ప్రస్తుతం పలువురు హీరోయిన్లు ఛాలెంజింగ్ రోల్స్ చేస్తున్నారు. అనుష్క, నయనతార, సమంతా లాంటి హీరోయిన్లు నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో క్యూట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా విభిన్న పాత్రల్లో అలరించేందుకు రెడీ అవుతుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు.. ఇందులో ప్రార్థనగా నటించి మెప్పించింది. అతి తక్కువ కాలంలోనే తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా మారింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ వరస సినిమాలు చేస్తుంది. ఆమె తాజాగా నటించి సుమారు అర డజన్ కు పైగా సినిమాలు ఈ ఏడాది విడుదల కాబోతున్నాయి. వాటిలో 6 సినిమాలు బాలీవడ్ కు చెందినవే. ఛత్రీవాలీ సినిమాలో రకుల్ కండోమ్ టెస్టర్ గా కనిపిస్తుందట. అటు బిగ్ బీ కీరోల్ చేస్తున్న రన్ వే-34, అజయ్ దేవగణ్, సద్ధార్థ మల్హోత్రాతో థ్యాంక్ గాడ్, ఆయుష్మాన్ ఖురానాతో డాక్టర్ జీ, అటాక్ తో పాటు మరో సినిమా చేస్తుంది.

తాజాగా తన కొత్త సినిమాల గురించి పలు విషయాలు వెల్లడించింది ఈ అమ్మడు. ఈ ఏడాది తన కెరీర్ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుందని భావిస్తున్నట్లు చెప్పింది. తన 7 సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నట్లు చెప్పింది. వాటిలో 6 హిందీ సినిమాలేనని చెప్పింది. ప్రతీ చిత్రం కొత్త జోనర్ వస్తుందని చెప్పింది. ఛత్రీవాలీలో కండోమ్ టెస్టర్, రన్ వే-34లో పైలెట్, అటాక్ సైన్స్ ఫిక్షన్, డాక్టర్ జీలో గైనకాలజిస్ట్ రోల్ చేస్తున్నట్లు చెప్పింది. గడిచిన రెండు సంవత్సరాలుగా ఈ సినిమాలు చేస్తున్నట్లు చెప్పింది. ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా? అనవి దురు చూస్తున్నట్లు చెప్పింది.