మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా తొలి రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలుసా?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 15 ఏళ్ల వ‌య‌సుకే `చాంద్ సా రోషన్ చెహ్రా` అనే హందీ చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన ఈ అందాల భామ‌.. `శ్రీ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అయినా.. త‌మ‌న్నా న‌ట‌న‌కు బాగానే మార్కులు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత‌ శేఖర్ కమ్ముల తీసిన `హ్యాపీ డేస్` సినిమాలో తమన్నా మధు అనే కాలేజ్ విద్యార్థినిగా నటించింది.

ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు తమన్నాకి నటిగా మంచి గుర్తింపు ద‌క్కింది. ఇక ఆపై ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేట‌స్‌ను అందుకున్న త‌మ‌న్నా.. టాలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌నా ఆడిపాడింది. అయితే ప్ర‌స్తుతం కోట్ల‌లో రెమ్యూన‌రేష‌న్ పుచ్చుకుంటున్న త‌మ‌న్నా తొలి సంపాద‌న ఎంతో తెలుసా..? రూ.ల‌క్ష‌. అవును, ఈ విష‌యాన్ని ఆమే స్వ‌యంగా తెలిపింది.

సినిమాల్లోకి రాక‌ముందు త‌మ‌న్నా ఓ కమర్షియల్ యాడ్ చేసింది. పగలు 10 ఎగ్జామ్స్ రాసి.. మధ్యాహ్నం 2 నుంచి 10 గంటల వరకు యాడ్ షూట్‌లో పాల్గొనేద‌ట‌. 2005లో జరిగిన ఈ యాడ్ కోసం మూడు రోజులు షూట్ చేస్తే లక్ష రూపాయల పారితోషికంగా ఇచ్చార‌ట‌. అదే త‌న తొలి సంపాద‌న అని త‌మ‌న్నా గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది.

కాగా, త‌మ‌న్నా సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చిరంజీవికి జోడీగా `భోళా శంక‌ర్‌` చిత్రంలో న‌టిస్తోంది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ కీల‌క పాత్ర‌ను పోషించ‌బోతోంది. అలాగే మ‌రోవైపు వెంకీకి జోడీగా అనిల్ రావిపూడి తెర‌కెక్కిన `ఎఫ్ 3`లో, స‌త్య‌దేవ్‌తో `గుర్తుందా శీతాకాలం` చిత్రాల్లోనూ త‌మ‌న్నా న‌టిస్తోంది.