పవన్ కళ్యాణ్ బాడీగార్డ్‌ల నెల‌వారీ జీతం ఎంతో తెలుసా?

సినీ సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌స్తే చాలు.. వాళ్ల‌ను చూసేందుకు అభిమానుల‌తో పాటు సాధార‌ణ ప్ర‌జ‌లు సైతం తెగ ఎగ‌బ‌డుతుంటారు. వారి నుంచి త‌మ‌ను తాము ర‌క్షించుకునేందుకే కొంద‌రు తార‌లు సొంతంగా బాడీ గార్డ్‌ల‌ను నియ‌మించుకుంటారు. ఈ లిస్ట్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక‌రు.

మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ప‌వ‌న్‌.. త‌న‌దైన టాలెంట్‌తో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్నారు. అంతేకాదు, అన్న‌కు మించి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఇక రాజకీయ పరంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన‌కు ఒక‌రు కాదు, ఇద్ద‌రు కాదు ఏకంగా ఐదుగురు బాడీగార్డులు ఉన్నారు.

బహిరంగ సభలకు, సినిమా ఈవెంట్ల‌కు, అలాగే ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారిని కంట్రోల్ చేయడం కోసం ఆ ఐదుగురు బాడీగార్డులు ప‌వ‌న్ చుట్టూనే ఉంటారు. ఇక సద‌రు బాడీగార్డ్‌ల నెల‌వారీ జీతాల విష‌యానికి వ‌స్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఒక్కొక్కరికి రూ. 80 వేల నుండి లక్ష రూపాయల వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో `భీమ్లా నాయ‌క్‌` సినిమా చేస్తున్నాడు. అలాగే మ‌రోవైపు క్రిష్ తెర‌కెక్కిస్తున్న‌ `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` అనే పిరియాడిక్ మూవీలో న‌టిస్తున్న ప‌వ‌న్‌.. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయాల్సి ఉంది. వీటితో పాటు మ‌రిన్ని ప్రాజెక్ట్స్ సైతం ప‌వ‌న్ చేతిలో ఉన్నాయి.