సినీ ఇండస్ట్రీ ని వదలని కరోనా..బారినపడ్డ మరో యువ హీరో..!

సినీ పరిశ్రమలో వరుసగా ఇప్పుడు కరోనా కలకలం సృష్టిస్తోంది. కొద్ది రోజుల క్రితం స్టార్ హీరోలు సైతం ఈ వైరస్ బారిన పడగా.. ప్రస్తుతం ఒక యువ హీరో కూడా ఈ మహమ్మారి బారిన పడినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హాయ్ యువ హీరో ఎవరో కాదు హీరో విశ్వక్ సేన్. తాజాగా ఈ రోజున కరుణ పాజిటివ్ నిర్ధారణ అయిందని స్వయంగా ఈ హీరోని తన సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది. విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికగా ఇలా తెలియజేశాడు.”నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.. నిన్న రాత్రి కరోనా పరీక్షల్లో ఈ విషయం బయటపడింది. దీంతో డాక్టర్లు సూచనల మేరకు నేను ఫోన్ ఐసోలేషన్ లో ఉన్నానని తెలియజేశారు.

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న అప్పటికీ ఈ మహమ్మారి సోకుతుంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి.ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటించండి, బయట అనవసరంగా తిరగవద్దు అంటూ విశ్వక్ సేన్ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు. రెండు రోజుల క్రితం హీరో మంచు కూడా ఈ వైరస్ బారిన పడడం జరిగింది. దీంతో ప్రజలు కాస్త భయభ్రాంతులకు గురవుతున్నారు.

https://twitter.com/VishwakSenActor/status/1476850650294018052?s=20