మామూలుగా సోషల్ మీడియా ఎక్కువగా నిత్యం ట్రోల్ అయ్యే అంశాలు ఏవంటే.. ఒకటీ క్రికెట్, రెండవ అంశం సినిమా. ఈ రెండు ప్రతిరోజు ఏదో ఒక చోట వైరల్ గా మారుతూనే ఉంటాయి. అయితే గత కొద్ది సంవత్సరాల నుంచి క్రికెటర్ల కు, హీరోయిన్లకు మధ్య ప్రేమాయణం నడుస్తూనే ఉన్నది. చాలామంది బాలీవుడ్ నటీమణులు ఏరికోరి మరీ క్రికెటర్ల ని ప్రేమించి వివాహం చేసుకుంటున్నారు. అలా ఇప్పటివరకు ఎంతో మంది చేసుకున్నారు.
అయితే తాజాగా మరో యువ క్రికెటర్ తన ప్రేమకు బ్రేక్అప్ చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. అది ఎవరంటే బాలీవుడ్ అందాల తార ఊర్వశి రౌతేలా.. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్ తో ప్రేమలో పడినట్లుగా గతంలో వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు వీరి ప్రేమకు బ్రేకప్ చెప్పి రిలేషన్ ను కట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది..
ఇక వీరిద్దరూ కూడా ఒకరినొకరు వాట్సాప్ ను మరొకరు బ్లాక్ చేసుకునే మారి పోయారని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. అయితే ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే స్వయంగా వారే తెలియజేయాలి.