వామ్మో..`ఆర్ఆర్ఆర్‌`కు అజయ్‌ దేవ్‌గణ్ అంత పుచ్చుకుంటున్నాడా?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా న‌టించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మించారు.

ఈ చిత్రంలో అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్ ఓ పాత్ర‌ను పోషించారు. ఆయ‌న పాత్ర సినిమాలో ఎంతో కీల‌కంగా ఉండ‌బోతోంది. ఇప్ప‌టికే ఈయ‌న పాత్ర‌కు సంబంధించిన పోస్ట‌ర్లు, వీడియోలు ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.

అయితే ఆర్ఆర్ఆర్‌కు అజ‌య్ దేవ్‌గ‌ణ్ పుచ్చుకుంటున్న రెమ్యూన‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.. ఈ సినిమాకు గానూ అజ‌య్ దేవ్‌గ‌ణ్ ఏకంగా రూ. 25 కోట్ల‌ను పారితోష‌కంగా పుచ్చుకుంటున్నార‌ట‌. అజ‌య్ దేవ్‌గ‌ణ్‌కు ఉన్న స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకునే ఆర్ఆర్ఆర్ మేక‌ర్స్ ఆయ‌న‌కు అన్ని కోట్లు ఇస్తున్నార‌ని తెలుస్తోంది.

కాగా, స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ‌తో రూపుదిద్దుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రం.. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న మొత్తం 14 భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. ఈ మూవీలో కొమురం భీంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతరామారాజుగా రామ్‌ చరణ్ క‌నిపించ‌బోతున్నారు.