శ్యామ్ సింగరాయ్ విషయంలో బాధపడుతున్న నాని.. కారణం..?

ప్రముఖ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం శ్యామ్ సింగరాయ్.. ప్రముఖ నిర్మాత వెంకట్ బోయపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి కథానాయకులుగా నటిస్తున్నారు. వైవిధ్యమైన కథతో.. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 24వ తేదీన విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.. అయితే విడుదల తేదీ ని చూసిన ప్రతి ఒక్కరు కూడా సోలో డేట్ ను నాని భలే ఫిక్స్ చేసుకున్నాడు.. కలెక్షన్ల విషయంలో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని అంతా అనుకున్నారు..Shyam Singha Roy Photos: HD Images, Pictures, Stills, First Look Posters of Shyam Singha Roy Movie - FilmiBeat

Varun Tej as a boxer in director Kiran Korrapati's 'Ghani' - The Hindu
కానీ ఈ సినిమాకు గట్టిపోటీ ఇవ్వడానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా, కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వస్తున్న గని చిత్రం రిలీజ్ కు సిద్ధం అయ్యింది. మొదట ఈ సినిమాను డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, చివరికి డిసెంబర్ 24వ తేదీకి వాయిదా వేసుకున్నారు.. ఇక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు ఎన్నో ఊహాగానాలను వ్యక్తపరుస్తున్నారు. నిజంగానే ఈ తేదీన గని సినిమా విడుదలైతే , నాని శ్యామ్ సింగరాయ్ సినిమా చిక్కుల్లో పడ్డట్టే. నాని కూడా ఆలోచనలో పడ్డాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.