అద్భుతమైన గ్రాఫిక్స్ తో రాధేశ్యాం ఫస్ట్ సింగిల్..!!

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా , పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగగా 2022 జనవరి 14వ తేదీన విడుదల చేస్తామని అధికారికంగా కూడా చిత్రం యూనిట్ ప్రకటించింది. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభాస్ ఇలాంటి రొమాంటిక్ జానర్లో సినిమా చేస్తుండడం గమనార్హం. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య గా ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ లో మనకు కనిపించబోతున్నాడు. విడుదలైన విక్రమార్క క్యారెక్టర్ టీజర్ దాదాపుగా 60 గంటలకు పైగా యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉండడం గమనార్హం.

Radhe Shyam Song: Good news for Prabhas fans .. Radheshyam first lyrical song has arrived .. | Ee raathale first lyrical song released from prabhas and pooja hegde radhe shyam movie | pipanews.com
ఇకపోతే వింటేజ్ బ్యాక్ డ్రాప్లో ఇటలీ లో జరిగే ప్రేమ కథ గా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి తాజాగా మొదటి లిరికల్ సాంగ్ విడుదల అయింది.. “ఎవరో వీరెవరో ” అంటూ వచ్చే ఈ పాటకు అనూహ్యమైన స్పందన లభిస్తోంది.. ప్రభాస్ ని సరికొత్త లుక్ లో ప్రెజెంట్ చేశాడు డైరెక్టర్.. జస్టిన్ ప్రభాకరన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది.. ఆకట్టుకునే గ్రాఫిక్స్ , డిజైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు.