ఆ కిలాడీ లేడీని నమ్మి రూ. కోట్లు పోగొట్టుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఫ్యామిలీ..!

ఆ లేడీ మామూలు లేడీ కాదు.. కిలాడీ. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు, పోలీసులు, న్యాయమూర్తులు, డాక్టర్లు, సినీ ఇండస్ట్రీ చెందినవారితో ఆ లేడీ దోస్తీ చేస్తుంది. ఆ తర్వాత మాయ మాటలు చెప్పి పెట్టుబడి కోసం అని, అప్పు అని రూ.కోట్లకు కోట్లు తీసుకుని కుచ్చు టోపీ పెడుతుంది. ఆమె పేరు శిల్పా చౌదరి. ఇటీవలి కాలంలో ఆమె బారినపడి మోసపోయిన వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా టాలీవుడ్ కి చెందిన ఒక అగ్ర నటుడు కుటుంబానికి చెందిన ముగ్గురు ఆమెను నమ్మి రూ. కోట్లు పోగొట్టుకున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

శిల్పా చౌదరి సెలబ్రిటీలతో స్నేహం చేస్తూ కిట్టి పార్టీల పేరిట తన ఇంటికి ఆహ్వానిస్తుంది. వారితో పేకాట ఆడుతుంది. లక్షలు విలువ చేసే మద్యం బాటిళ్లు తెప్పించి పార్టీ ఇస్తుంది. ఈ వ్యవహారం అంతా ఎంతో లగ్జరీ గా సాగుతుంది. రెగ్యులర్ గా ఇలాంటి పార్టీలు నిర్వహిస్తూ డబ్బున్న వాళ్ళకు బాగా దగ్గరవుతుంది శిల్పా చౌదరి.

ఆ తర్వాత ఆమె మెల్లగా తన నిజస్వరూపాన్ని చూపిస్తుంది. సినిమాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేందుకు డబ్బు అవసరం ఉందని..వడ్డీ ఇస్తానని చెప్పి.. కోట్లకు కోట్లు వసూలు చేస్తుంది. ఆ తర్వాత బిచనా ఎత్తేస్తుంది. ఈమె మాయలో పడి ప్రముఖుల భార్యలు, చెల్లెలు, కోడళ్ళు మోసపోయారు.

టాలీవుడ్ లో ప్రముఖ హీరో కు చెందిన కుటుంబ సభ్యుల్లో ముగ్గురు శిల్పకు రూ.12 కోట్లు ఇచ్చి మోసపోయినట్లు సమాచారం. శిల్ప చేతిలో మోసపోయిన వాళ్లలో ఒక్కొక్కరు రూ.2కోట్లు,5 కోట్లు, 6 కోట్లు,12 కోట్లు చొప్పున మోసపోయినట్లు తెలుస్తోంది. శిల్పా చౌదరి మోసాలు తెలిశాక బాధితులు పోలీస్ స్టేషన్ కు చేరుకొని వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఆమె మోసాల గురించి మీడియాలో వార్తలు వస్తుండడంతో ఆమెకు గతంలో డబ్బు ఇచ్చి మోసపోయిన వారు పెద్ద సంఖ్యలో వచ్చి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

Share post:

Popular