విడాకుల త‌ర్వాత స‌మంత జోరు..ఆ హీరో కోసం కీర్తి సురేష్‌తో పోటీ..?!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లె భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. విడాకుల త‌ర్వాత కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన సామ్‌.. వ‌రుస సినిమాల‌ను ఒప్పుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేప‌థ్యంలోనే న్యాచుర‌ల్ స్టార్ నాని కోసం కీర్తి సురేస్‌తో పోటీకి సిద్ధ‌మైంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

Nani 29 film Dasara First Look Motion poster Released -

నాని ఇటీవ‌ల ద‌స‌రా పండ‌గ రోజున `ద‌స‌రా` అనే టైటిల్‌తో ఓ సినిమాను ప్ర‌క‌టించాడు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్‌ ఓదేల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తెలంగాణ నేపధ్యంలో తెర‌కెక్క‌బోతున్న ఈ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రంలో కీర్తి స‌రేష్ హీరోయిన్‌గా న‌టించ‌బోతోంది.

Nani to produce Samantha's next?

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ మూవీలో కీర్తికి పోటీగా మ‌రో హీరోయిన్ కూడా ఉండ‌నుంద‌ట‌. ఆ హీరోయిన్‌ పాత్రలో స‌మంత మెర‌వ‌బోతోంద‌ని.. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు సైతం పూర్తి అయ్యాయ‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే. కాగా, స‌మంత ఇప్ప‌టికే నానితో ఏటో వెళ్లిపోయింది మనసు, ఈగ చిత్రాల్లో న‌టించింది. ఒక‌వేళ‌ తాజా ప్ర‌చారం నిజ‌మైతే.. ముచ్చ‌ట‌గా మూడో సారి వీరిద్ద‌రూ జోడీ క‌ట్టిన‌ట్టు అవుతుంది.