ర‌వితేజ దెబ్బ‌కు ఆస్తులు అమ్ముకున్న క‌ళ్యాణ్ రామ్..ఏమైందంటే?

November 2, 2021 at 9:07 am

క‌ళ్యాణ్ రామ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నంద‌మూరి వంటి బ‌డా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన క‌ళ్యాన్ రామ్.. స్టార్ హీరోగా ఎద‌గ‌లేక‌పోయినా టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఓవైపు హీరోగా చేస్తూనే.. మ‌రోవైపు త‌మ్ముడు ఎన్టీఆర్ సినిమాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తూ స‌త్తా చాటుతున్నారు.

Kalyan Ram in MAA Elections? Truth is here - TeluguBulletin.com

ఇక ఇన్నేళ్ల త‌న సినీ కెరీర్‌లో క‌ళ్యాణ్ రామ్ ఎన్నో ఒడుదుడుకుల‌ను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఒకానొక స‌మ‌యంలో అప్పుల పాలై త‌న ఆస్టుల‌ను సైతం అమ్మేశాడు. అవును, `అతనొక్కడే` సినిమాతో నిర్మాతగా మారిన క‌ళ్యాణ్ రామ్‌.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌ను స్థాపించి ఎన్నో సినిమాలు నిర్మించాడు. తన చిత్రాలే కాదు రవితేజతో `కిక్2`, ఎన్టీఆర్‌తో `జై లవ కుశ` వంటి సినిమాల‌ను నిర్మించాడు. అయితే వీటిలో సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ హీరోగా తెర‌కెక్కిన‌ కిక్‌2 చిత్రం కళ్యాణ్ రామ్‌ను భారీగా దెబ్బ కొట్టింది.

Kick 2 Movie Full Download | Watch Kick 2 Movie online | Movies in Telugu

నిర్మాతగా హిట్లులేక ఇబ్బంది పడతున్న స‌మ‌యంలో క‌ళ్యాణ్ రామ్‌ను సురేందర్ రెడ్డి కిక్-2 మూవీ నిర్మాణ‌ బాధ్యతలు తీసుకోమ‌ని చెప్పాడ‌ట‌. ఈ సినిమాతో తన అపజయాలకు బ్రేక్ పడుతుంద‌ని న‌మ్మిన క‌ళ్యాణ్ రామ్‌.. అందుకు ఒకే చెప్పాడ‌ట‌. అయితే రీషూట్ల కార‌ణంగా ఈ సినిమాకు అనుకున్న దానికంటే భారీ బ‌డ్జెట్ అయింద‌ట‌. పోని సినిమా హిట్టైందా అంటే అదీ లేదు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ మూవీ ఘోరంగా ఫ్లాప్ అయింది. దాంతో ఈ సినిమా దెబ్బ‌కు క‌ళ్యాణ్ రామ్ ఆస్తులు అమ్ముకుని అప్పులు క‌ట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

Surender Reddy-Dil Raju to collaborate?

ర‌వితేజ దెబ్బ‌కు ఆస్తులు అమ్ముకున్న క‌ళ్యాణ్ రామ్..ఏమైందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts