ఒకప్పుడు టాప్ హీరోయిన్ ప్రస్తుతం బిచ్చగత్తె.. ఎవరంటే?

సినీ ఇండస్ట్రీలో కొందరు సెలబ్రిటీలు రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా రాత్రికి రాత్రే జీవితాలు తారుమారైన వారు కూడా చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలుగా కొనసాగుతూ ఉన్నఫలంగా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైన వారు చాలా మంది ఉన్నారు. అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ డమ్ ను అనుభవించి చివరిరోజుల్లో అనాథలుగా మరణించిన వారు ఎంతో మంది ఉన్నారు.

అలాంటి వారిలో సీనియర్ నటి కూడా ఒకరు. అప్పట్లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతూ, సీనియర్ హీరోల సరసన నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. అలా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఆమె పలు వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలపై దృష్టి చూపలేకపోయింది. ఈ నేపథ్యంలోనే అవకాశాలు వస్తున్నప్పటికీ ఆమె తిరస్కరించింది. ఇలా చేయడంతో దర్శకనిర్మాతలు కూడా ఆమెను సంప్రదించడం మానేశారు. అలా సినిమా అవకాశాలు రాక, తన అనుకున్న వాళ్లు అందరూ ఆమె ఆస్తిని దోచుకుని ఆమెను ఒంటరిదాన్ని చేశారు. ఆమె అనాథగా గడుపుతూ ప్రస్తుతం పూట గడవడం కూడా కష్టం అవడంతో బిచ్చగత్తె గా మారి అవసరాల కోసం బిక్షాటన కూడా చేస్తోంది.