`మాన్‌స్టర్‌` అంటున్న మంచు లక్ష్మి..మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ముద్దుల కూతురు, న‌టి, నిర్మాత మంచు ల‌క్ష్మి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా మంచి న‌టిగా టాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న మంచు ల‌క్ష్మి.. త్వ‌ర‌లోనే మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది.

Monster: Manchu Lakshmi with Mohanlal -

అది కూడా సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్ సినిమాతో. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కనున్న తాజా చిత్రం `మాన్‌స్టర్‌`. వైశాఖ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మంచు ల‌క్ష్మి ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతోంది. ఈ విష‌యాన్ని ఆమెనే సోష‌ల్ మీడియా ద్వారా స్వ‌యంగా ప్ర‌క‌టించింది.

Lakshmi Manchu shares her fangirl moment with veteran actor and BB Malayalam host Mohanlal; says, "you have inspired me all through my life" - Times of India

మాన్‌స్టార్‌ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ను పోస్ట్‌ చేసిన మంచు లక్ష్మి.. `ఎట్టకేలకు క్యాట్‌ బయటకు వచ్చేసింది. కొత్త భాష, కొత్త జానర్‌. సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌తో మలయాళంలో నటిస్తోన్న నా తొలి చిత్రంపై ఎంతో ఆసక్తిగా ఉన్నాను. ఈ సినిమాలో నటించడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా కోసం షూటింగ్‌లో పాల్గొన్న సమయం ఎప్పటికీ మరిచిపోలేనిది’ అంటూ రాసుకొచ్చారు.

https://www.instagram.com/p/CWSGmQujzqH/?utm_source=ig_web_copy_link