జై భీమ్.. సినిమా వివాదం పై సూర్య ఏమన్నాడంటే..!

November 15, 2021 at 2:03 pm

సూర్య హీరోగా ఇటీవల నటించిన చిత్రం జై భీమ్. అయితే ఈ సినిమా సక్సెస్ సాధించినప్పటికీ.. కానీ సూర్య మాత్రం విమర్శకుల పాలవుతున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తమిళనాడు ఉత్తర భాగానికి చెందిన ‘వన్నియార్లు’ అనే కమ్యూనిటీని అవమానించిందని పీఎంకే యువజన నాయకుడు అన్బుమణి ఆరోపించారు

దీనిపై సూర్య మాట్లాడుతూ..”నా తోటి మనుషుల జీవితాలను మెరుగుపరిచేందుకు నా వంతు ప్రయత్నం నేను చేశాను.. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకు ఉంది. ఒకరిని దూషించి పబ్లిసిటీ పొందాలనే ఉద్దేశం నాకు లేదు అని తెలియజేశాడు. అంతేకాకుండా ఏ వర్గాన్ని నేను కించపరిచే విధంగా మా చిత్రాన్ని తెరకెక్కించ లేదని చెప్పుకొచ్చాడు. కొన్ని అభ్యంతరకర సన్నివేశాలపై ప్రస్తావన రాగానే సినిమాలో మార్పులు చేశాం. ఇందులో ని సన్నివేశాలు ఏ ఒక్కరిని ఉద్దేశించి తీసినవి కావు. వీటన్నిటినీ నిరూపించడానికి ఆధారాలు ఉన్నాయని సూర్య తెలియజేశాడు. ఏది ఏమైనా జై భీమ్ లాంటి సినిమా మరెన్నడూ రాదని చెప్పుకోవచ్చు.

జై భీమ్.. సినిమా వివాదం పై సూర్య ఏమన్నాడంటే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts