త్రివిక్ర‌మ్ బ‌ర్త్‌డే..సూప‌ర్‌ ట్రీట్ ఇచ్చిన `భీమ్లా నాయ‌క్‌` టీమ్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అయితే నేడు త్రివిక్ర‌మ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా భీమ్లా నాయ‌క్ టీమ్ సూప‌ర్ ట్రీట్ ఇచ్చారు.

Bheemla Nayak first look: Pawan Kalyan fights goons in Telugu remake of Ayyappanum Koshiyum, watch video | Entertainment News,The Indian Express

ఈ సినిమాలో `లాలా..బీమ్లా..`అంటూ సాగే టైటిల్ సాంగ్ ను త్రివిక్రమ్ రాసారు. ఆ పాటనే నేడు విడుదల చేసారు మేక‌ర్స్‌. హీరో పవన్ పాత్ర అయిన భీమ్లా నాయక్‌ను హైలైట్ చేస్తూ సాగే ఈ పాటను త‌మ‌న్ అందించిన మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది.

Trivikram Srinivas gets Legal shock

అలాగే ఈ సాంగ్‌లో సినిమాలోని కొన్ని సీన్ల‌కు సంబంధించిన ఫొటోల‌ను కూడా చూపించారు. మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న తాజా సాంగ్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. సూర్యదేవర నాగవంశీ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.