స్వీటీ కాకుండా అనుష్క‌ను ముద్దుగా ఏమంటారో తెలుసా?

November 7, 2021 at 11:52 am

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సూపర్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ఈ భామ‌.. `విక్రమార్కుడు` సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ టాలీవుడ్‌లోనే టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క‌.. `అరుంధతి` మూవీతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్‌గా మారింది.

Interesting facts about Anushka Shetty | The Times of India

అలాగే బాహుబలిలో దేవసేన పాత్ర.. ఆమెకు మరో మైలురాయిగా చెప్పోచ్చు. అయితే అనుష్క 40వ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు.పి డైరెక్షన్ లో యువి క్రియేషన్స్ బ్యానర్ పై త‌న 48వ చిత్రాన్ని ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అనుష్క పర్సనల్ విషయాలకు వస్తే.. మంగుళూరులో పుట్టిన అనుష్క పాఠశాల, కళాశాల విద్య అంతా బెంగుళూరులోనే జరిగింది. ఈమె మాతృభాష తులు.

 అనుష్క ప్రభాస్ సరసన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సిరీస్‌  (Bahubali series) తర్వాత ‘భాగమతి ‘(Bhaagamathie), నిశ్శబ్దం’, వంటి సినిమాలను చేశారు. ఈ సినిమాల తర్వాత ఆమె ఓ సినిమాకు ఓకే చెప్పిన దానికి సంబంధించి అధికారికంగా ప్రకటించలేదు. (Twitter/Photo)

కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని పిలిస్తే.. సన్నిహిత స్నేహితులు `టొమ్ములు` అని ముద్దుగా పిలుస్తారు. హిస్టరీ, ఎకనామిక్స్‌, సైకాలజీ, సోషియాలజీలో డిగ్రీ చేసిన అనుష్క‌ బీసీఏ కూడా పూర్తి చేసింది. ఆ త‌ర్వాత ఓ స్కూల్‌లో మూడో తరగతి పిల్లలకు పాఠాలు చెప్ప‌డ‌మే కాదు యోగా టీజ‌ర్‌గా కూడా ప‌ని చేసింది. ఆ త‌ర్వాత హీరోయిన్‌గా నిల‌దొక్కుకున్న ఈ బెంగుళూరు భామ‌ తెరపై ఎలా ఉన్నా.. తెర వెనుక మాత్రం చాలా పద్ధతిగా ఉంటుంది.

 

స్వీటీ కాకుండా అనుష్క‌ను ముద్దుగా ఏమంటారో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts