భయంక‌ర‌మైన లుక్‌లో సునీల్‌..`పుష్ప‌`రాజ్‌కి ప‌ర్ఫెక్ట్‌గా సెట్టైయ్యాడుగా!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను `పుష్ప ది రైస్‌` పేరుతో డిసెంబ‌ర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల చేయ‌బోతున్నారు.

Allu Arjun reveals Pushpa release date | Entertainment News,The Indian Express

అలాగే ఈ చిత్రంలో మ‌ల‌యాళ న‌టుడు ఫహద్‌ ఫాజిల్ మ‌రియు ప్ర‌ముఖ న‌టుడు సునీల్ లు విల‌న్ల‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఫ‌హ‌ద్ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయ‌గా.. తాజాగా సునీల్‌ను `రాక్షసుడి పరిచయం.. మంగళం శ్రీనుగా సునీల్‌` అని చిత్ర టీమ్ పేర్కొంటూ ఫ‌స్ట్ లుక్‌ను రివిల్ చేసింది.

Image

ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో సునీల్‌ మునుపెన్నడూ లేనివిధంగా ఎరుపెక్కిన కళ్లతో సీరియస్‌ లుక్‌లో చాలా భ‌యంక‌రంగా ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఫ‌స్ట్ లుక్ చూశాక‌.. పుష్ప‌రాజ్‌కి విల‌న్‌గా సునీల్ ప‌ర్ఫెక్ట్‌గా సెట్టైయ్యాడ‌ని అంటున్నారు. ఏదేమైనా సునీల్ ఎంతో కాలంగా వేచి చూస్తున్న బ్రేక్ పుష్ప చిత్రంతో అందుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.