విశ్వనాథ్ విశ్వరూపం పుస్తకం ఆవిష్కరణ..?

కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన అక్కినేని నాగేశ్వరావు నటించిన ఆత్మగౌరవం సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు.ఎన్నో సినిమాలతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసును గెలుచుకున్న గొప్ప దర్శకుడు కె విశ్వనాథ్. అంతేకాకుండా తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి విశ్వనాథ్.శంకరాభరణం, సాగరసంగమం, సిరివెన్నెల,స్వాతిముత్యం, సిరిమువ్వ, స్వర్ణ కమలం లాంటి గొప్ప సినిమాలకు దర్శకత్వం వహించారు.కేవలం దర్శకత్వం మాత్రమే కాకుండా నటుడిగా కూడా తనదైన చెరగని ముద్ర వేశారు విశ్వనాథ్. ఇక ఇది ఇలా తాజాగా ఉంటే విశ్వనాధ్ విశ్వరూపం పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

కళాతపస్వి కె.విశ్వనాథ్ సినిమాలపై రామశాస్త్రి రచించిన విశ్వనాథ్ విశ్వరూపం పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ పుస్తకాన్ని కె.విశ్వనాథ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ పుస్తక ఆవిష్కరణ సభ లో తనికెళ్ల భరణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వనాథ్ అంటే అందరికీ ఉండే అభిమానం,ప్రేమ.. రచయిత రామశాస్త్రి ఈ విషయంలో భక్తిగా మారిందన్నారు. విశ్వనాథ్ సినిమాలని పరమ పవిత్రమైన మనసుతో చూసి పరిశీలించి,పరీక్షించి, పరవశించింది ఈ పుస్తకం రాశాను అన్నారు.ఈ ఈ నేపథ్యంలో విశ్వనాథ్ మాట్లాడుతూ తన చిత్రాల మీద సమగ్రమైన థిసిస్ వంటి.రచన చేయడం చాలా ఆనందంగా ఉందని, అలాగే ఈ పుస్తకం రాయడం ఎంతో కష్టమని ఆయన అన్నారు.