ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ అంటే తెలియని వారుండరు. బుల్లితెర ప్రేక్షకులకు సూపర్ ఎంటర్‌టైన్మెంట్ అందించే ఈ షో ద్వారా ఎందరో కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కొందరైతే ఈ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో హీరోలుగా కూడా మారారు. అయితే ఈ షోకు మొదటి నుంచీ రోజా, నాగబాబులు జడ్జీలుగా వ్యవహరించారు.
కానీ, ఆ మధ్య పలు కారణాల వల్ల నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకోగా.. ఆ స్థానంలో మన టాప్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు నటుడు మనో సెటిల్ అయిపోయారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ షో ప్రోమో ఒకటి ఈటీవీ వారు విడుదల చేయగా.. ఇప్పుడా ఓ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ప్రోమోలో ఏముందంటే.. ఎపిసోడ్లో భాగంగా కంటెస్టెంట్లు, యాంకర్ అనసూయ బాలకృష్ణకు ఫోన్ చేయాలని జడ్జి రోజాను కోరారు. దాంతో రోజా ముందు కాస్త భయపడినా.. ఆ తర్వాత బాలయ్యకు కాల్ చేసి అందిరి ముందే మాట్లాడారు.
అఖండ షూటింగ్‌లో ఉన్న బాలయ్య రోజాతో ఎంతో కూల్‌గా మాట్లాడారు. ఈ క్రమంలోనే రోజా మాట్లాడుతూ..`మళ్లీ మనం ఇద్దరం కలిసి ఎప్పుడు నటిద్దాం` అని అడగ్గా.. `మన కాంబినేషన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు` అంటూ బాలయ్య నవ్వేశారు. అలాగే కమెడియన్లు అభి, రాఘవ, ఆదిలతోనూ బాలయ్య సరదాగా మాట్లాడారు. తేకాదు, ఈ సందర్భంగా బాలయ్య త్వరలోనే జబర్దస్త్ షోకి జడ్జిగా కూడా వస్తానని మాటిచ్చారు. దాంతో అక్కడనే ఉన్న రోజా, యాంకర్ అనసూయ మరియు కంటెస్టెంట్లు ఆనందంతో ఉబ్బితబ్బిపోయారు.