ఒకేసారి న‌లుగురు పిల్ల‌లు..నా బెస్ట్ ఇస్తానంటున్న‌ నిఖిల్‌!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్టార్ హీరోగా ఎద‌గ‌లేక‌పోయినా సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నిఖిల్‌.. ప్ర‌స్తుతం నాలుగు పడవల ప్రయాణం చేస్తున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

Actor Nikhil Siddhartha stopped by Hyderabad cops during medicine run: I thought medical emergencies are allowed, he says | Telugu Movie News - Times of India

తాజాగా నిఖిల్ ఓ ట్వీట్ చేశాడు. `ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తున్నాను. గతంలో ఎన్నడూ ఇలా చేయలేదు. ఇప్పటి వరకు ఒకసారి ఒకే సినిమాలో నటించాను. కానీ ఈ సారి మాత్రం నాలుగు చిత్రాల్లో నటిస్తున్నాను. ఈ నాలుగు సినిమాలు కూడా తనకు నలుగురు పిల్లల లాంటి వారు.

Karthikeya 2: Nikhil Siddharth To Play A Doctor In This Chandoo Mondeti directorial

వీటిలో దేనికి మొదటి స్థానాన్ని ఇవ్వాలో నాకు అర్థం కావడం లేదు. అన్ని సినిమాలకు నాలోని బెస్ట్‌ను ఇస్తున్నాను. అన్ని సినిమాలు మంచి సక్సెస్‌ కావాలని ప్రార్థిస్తున్నాను` అంటూ ట్వీట్ చేయ‌గా.. అది కాస్త వైర‌ల్‌గా మారింది. కాగా, ప్ర‌స్తుతం నిఖిల్ 18 పేజెస్, కార్తికేయ-2 చిత్రాలు చేస్తున్నారు. అలాగే ఎడిటర్ గ్యారీ దర్శకుడుగా మారి తెరకెక్కిస్తున్న ఒక స్పై థ్రిల్లర్‌లోనూ, సుధీర్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలోనూ నిఖిల్ న‌టిస్తున్నాడు.

https://twitter.com/actor_Nikhil/status/1452712403330760704?s=20