త్వ‌ర‌లోనే రెండో పెళ్లి..ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన మంచు మ‌నోజ్‌..!

October 27, 2021 at 7:52 am

టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు మ‌నోజ్ స్టార్ హీరోగా ఎద‌గ‌లేక‌సోయినా.. టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను మాత్రం క్రియేట్ చేసుకున్నాడు. ఇక మ‌నోజ్‌ వ్య‌క్తిగ‌త జీవితం గురించి అంద‌రికీ తెలిసిందే.

Manoj Manchu confirms divorce with wife Pranathi Reddy: We went through a  lot of pain

2015లో మనోజ్, ప్రణతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దురదృష్టవశాత్తు వారి వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. 2019లో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. విడాకుల త‌ర్వాత సినీ కెరీర్‌పైనే ఫోక‌స్ పెట్టాడు మ‌నోజ్‌. అయితే ఇలాంటి త‌రుణంలో మ‌నోజ్ ఓ ఫారెన్‌ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడ‌ని.. త్వ‌ర‌లోనే ఆమెను పెళ్లి కూడా చేసుకోబోతున్నాడ‌ని గ‌త కొద్ది రోజుల నుంచీ వార్త‌లు తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Manchu Manoj's dream house in Chennai

అయితే ఈ వార్త‌లు కేవ‌లం పుకార్లే అంటూ మ‌నోజ్ తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ మేర‌కు మ‌నోజ్ త‌న‌దైన శైలిలో ఓ ట్వీట్ చేశారు. `నా పెళ్లికి దయచేసి నన్ను కూడా ఆహ్వానించండి. ఇంతకీ పెళ్లి ఎక్కడా.? ఆ బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల ఎవరు.? మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం` అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేయ‌గా.. అది కాస్త వైర‌ల్‌గా మారింది.

త్వ‌ర‌లోనే రెండో పెళ్లి..ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన మంచు మ‌నోజ్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts