మెగా స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఒక భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ చిత్రంని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. రామ్చరణ్ సరసన కియారా అద్వాని కూడా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూణెలో జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక తాజా విషయం బాగా వైరల్ గా మారుతోంది.
అదేమిటంటే ఈ సినిమాలో విలన్ పాత్రలో ఒక మలయాళ నటుడు సురేష్ గోపి నటిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ సినిమాలకి ఈ పాత్ర హైలెట్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ పాత్రకి సురేష్ గోపి అయితే సరిగ్గా సెట్ అవుతారనే డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కూడా భావించి అతని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇంకా రాలేదు త్వరలోనే ఈ విషయం నిజంగా చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేస్తారేమో వేచి చూడాల్సిందే. అయితే సురేష్ భార్య ఇషా గుప్తా కూడా ఈ సినిమాలో ఒక నెగిటివ్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.