హైప్రొఫైల్ రేవ్ పార్టీపై హఠాత్తుగా దాడి చేసిన ఎన్‌సిబి.. కారణం?

మాదక ద్రవ్యాలు నిరోధక శాఖ తాజాగా హఠాత్తుగా ముంబై తీరంలోనే కార్డెలియా క్రూయిజ్ ఎంప్రెస్ నౌక పై దాడి చేసింది. ఇందులో రేవ్ పార్టీ జరుగుతున్న సమయంలో అధికారులు అక్కడి వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న వారిలో బాలీవుడ్ సూపర్ స్టార్ కుమారుడు కూడా ఉన్నారు. వీరి వద్ద నుంచి కొకైన్, గంజాయి, ఎండిఎంఏ వంటి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి విచారిస్తున్నట్లు ఎన్సీబీ ముంబై డైరెక్టర్ సమీర్ వాంఖడే వెల్లడించారని ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది.

అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో పాటు, అర్బాజ్ మర్చంట్, దయేచాను, నుపుర్ సారిక, ఇస్మిత్ సింగ్, మొహక్ జైస్వాల్, విక్రాంత్ చోకేర్, గోమిత్ చోప్రా, ఉన్నారు ప్రస్తుతం అధికారుల అదుపులో ఉన్న వారిని అక్కడ ఉన్న సామాగ్రీ ముంబై కి తరలించారు. సాధారణ ప్రయాణికుల వలే మాదక ద్రవ్యాలు నిరోధక శాఖ అధికారులు నౌక లోకి ఎక్కారు. నౌక ముంబై తీరాన్ని వదిలి సముద్రం మధ్యలోకి చేరగానే పార్టీ మొదలైంది. దీంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమై పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 13 మంది అధికారులు అదుపులోకి తీసుకోగా అధికారుల నుంచి ఎటువంటి ధ్రువీకరణ లభించలేదు. నౌక యాజమాన్యానికి కూడా అధికారం నోటీస్ పంపించినట్లు తెలుస్తోంది.