`ఆర్ఆర్ఆర్‌` దెబ్బ‌కు త‌గ్గేది ప‌వ‌నా..? లేక‌ మ‌హేషా..?

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్‌` ఎప్పుడెప్పుడు విడ‌ద‌ల అవుతుంద‌ని ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తుండ‌గా.. మేక‌ర్స్ వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దాంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో గందరగోళం మొదలైంది.

Official: Rajamouli confirms the RRR release date - English

ఇందుకు కార‌ణం సంక్రాంతి బ‌రిలో మ‌హేష్ బాబు సర్కారువారి పాట, ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ్లానాయక్, ప్ర‌భాస్‌ రాధేశ్యామ్ చిత్రాలు ఉండ‌ట‌మే. అయితే ఈ మూడు చిత్రాల్లో పాన్ ఇండియా చిత్ర‌మైన రాధేశ్యామ్ జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాబోతుండ‌గా.. అది మారే ప్ర‌స‌క్తే లేదు. ఇక ఎటొచ్చీ మ‌ధ్య‌లో న‌లిగి పోయేవి భీమ్లానాయ‌క్‌(జ‌న‌వ‌రి 12), సస‌ర్కారు వారి పాట‌(జ‌న‌వ‌రి 13) చిత్రాలే.

After RRR, now Radhe Shyam first single lyrics are leaked! - English

రెండు పాన్ ఇండియా చిత్రాల మ‌ధ్య విడుద‌లైతే థియేట‌ర్లు దొర‌క‌డం అటు ప‌వ‌న్‌కు, ఇటు మ‌హేష్‌కు ఇద్ద‌రికీ క‌ష్ట‌మే. ఈ ప్ర‌భావం వ‌సూళ్ల‌పై తీవ్రంగా ప‌డుతుంది. బ‌డ్జెట్లు రిక‌వ‌ర్ కావ‌డం చాలా క‌ష్టం. మంచి టాక్ వ‌చ్చినా ఆశించిన ఫ‌లిత‌ముండ‌దు. ఈ నేప‌థ్యంలోనే మ‌హేష్‌, ప‌వ‌న్‌ల‌లో ఎవ‌రు వెన‌క్కి త‌గ్గుతారు అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

rrr: 'RRR' announces new release date .. 'Bhimla', 'Sarkaru Vari Pata' release postponed? - bheemla nayak and sarkaru vaari paata release date postponed » Jsnewstimes