దాసరి మరణం వెనుక ఎవరికి తెలియని రహస్యం?

నటుడు, రచయిత, దర్శకుడు అయినా దాసరి నారాయణరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన సినీ కెరీర్లో ఎన్నో విజయాలను అందుకున్న. 150 కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అలాగే 53 కు పైగా సినిమాలను నిర్మించాడు. అంతేకాకుండా ఎంతోమంది నటీనటులను సినీరంగానికి పరిచయం కూడా చేశారు . సీనియర్ ఎన్టీఆర్, దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ముఖ్యంగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాయి.

ఇది ఇలా ఉండే దర్శకుడు రేలంగి నరసింహారావు ఒక ఇంటర్వ్యూలో దాసరి నారాయణరావు గురించి పలు వ్యాఖ్యలు చేశారు. దాసరి నారాయణరావు సన్నబడటం కోసం బెలూన్ వేయించుకున్నారని, ఆ సమయంలో సన్న పడ్డారని తెలిపారు. ఆ తర్వాత బెలూన్ తీసేసిన తర్వాత మళ్లీ బెలూన్ వేయించుకున్నారని రేలంగి తెలిపారు. ఆ తర్వాత దాసరికి బెలూన్ ను జూనియర్ డాక్టర్లు వేశారని ఆ బెలూన్ పంక్చర్ కావడంతో ఇన్ఫెక్షన్ వచ్చిందని, ఆ ఇన్ఫెక్షన్ వల్లే దాసరి నారాయణరావు చనిపోయారని రేలంగి నరసింహారావు వెల్లడించారు. అలాగే దాసరి నారాయణ రావు ఆరోగ్యం గురించి తాను విన్నది అదేనని రేలంగి తెలిపారు.