మళ్ళీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన పేరును మార్చుకున్న సమంత?

ప్రముఖ టాలీవుడ్ నటి సమంత తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పేరును ఇవాళ మళ్లీ మార్చారు. తన హ్యాండిల్ నేమ్ గా మెన్షన్ చేశారు. చైతు విడాకుల న్యూస్ వస్తున్న సమయంలో సమంత అక్కినేని తన సోషల్ మీడియా హ్యాండిల్‌ను మార్చి కేవలం S అన్న అక్షరం మాత్రమే పెట్టారు. ఇక నాగచైతన్యతో పెళ్లికి ముందు సమంత సోషల్ మీడియా హ్యాండిల్స్ లో సమంత రుతు ప్రభు అని ఉండేది. మూడేళ్ళు సమంత అక్కినేని గా ఇండస్ట్రీలో నిలిచిన ఈ బ్యూటీ మళ్లీ సమంత రుతు ప్రభు గా మారిపోయింది.

ఇండస్ట్రీ లోనే కాకుండా బయట కూడా చాలామంది ఈ జంటను చూసి అసూయపడేవారు. అయితే వీరు ఒక్కసారి గా విడిపోతున్నారు అన్న వార్త ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. మొదటి నమ్మక పోయినా తర్వాత సమంత నాగ చైతన్య ట్వీట్ చేసిన తరవాత నమ్మారు. సమంతని పర్సనల్ గా చూడకపోయినా, కలవక పోయినా చాలామందికి సమంతా ఒక ఇన్స్పిరేషన్. అలాంటిది సమంత విడాకులు తీసుకోవడం ఏంటి అనే ప్రశ్న అందరినీ ఇంకా వెంటాడుతూనే ఉంది. ఏం మాయ చేశావే సినిమాతో ప్రేమలో పడ్డ ఈ జంట పదకొండేళ్ల పాటు ప్రేమను సాగిస్తూ నాలుగేళ్ల వివాహబంధానికి ఊహించని విధంగా ముగింపు పలికారు.