నాట్యం అంటే ఒక కథను చెప్పడం అంటున్న యంగ్ హీరోయిన్..!!

అక్టోబర్ 22వ తేదీన ప్రముఖ దర్శకుడు రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిలిమ్స్ పతాకంపై..ప్రముఖ నృత్య కారిణి సంధ్య రాజు నటిస్తూ , స్వయంగా నిర్మిస్తున్న సినిమా నాట్యం.. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా హీరోయిన్ సంధ్య రాజు నాట్యం సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.. ఆమె మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి నాట్యం అంటే నాకు ప్రాణం..సినిమా ద్వారా ప్రేక్షకులకు ఇంకా దగ్గరగా రావొచ్చు అనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్టును ఎంచుకున్నాను.. సాధారణంగా నాట్య ప్రదర్శనలు చేస్తే ఎప్పుడూ కూడా పీపుల్స్ ఒకే సెక్షన్ చూస్తుంటారు.. కానీ ఒక షార్ట్ ఫిలిం ద్వారానే నాట్యం గురించి ఎంతోమందికి చెప్పాము.. అది చాలా బాగా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది.. సినిమా మాధ్యమానికి ఉన్న శక్తి ఏమిటో అర్థమైంది.. అందుకే ఈ సినిమాను తీశాను అని ఆమె తెలిపింది..

సినిమా లో నాట్యం అంటే కేవలం కాళ్ళు, చేతులు కదపడం కాదు. నాట్యం ద్వారా ఒక కథను చెప్పడం అని మా దర్శకుడు ఆలోచన ఈ చిత్రంలో కనిపిస్తుంది.ఈ నాట్యం ద్వారా జనాల్లో కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి.. పాత కాలంలో నాట్యం అనేది కూడా ఒక సినిమా లాంటిదేనని ఆమె తెలిపింది. ఈ చిత్రంలో రెండు మూడు కథలు అంతర్లీనంగా ఉంటాయి.. గురుశిష్యుల మధ్య సంబంధాన్ని, క్లాసికల్ డాన్స్.. ఫోక్ డాన్స్ కి మధ్య తేడా కూడా చూపిస్తామని ఆమె తెలిపింది..