మొదటిసారి కమెడియన్ల తో విభిన్నమైన కథతో బుజ్జి ఇలారా టీజర్..?

హీరో, కమెడియన్ గా సినీ ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు నటుడు సునీల్. ఇక మరో కమెడియన్ ధనరాజ్ కూడా విభిన్నమైన పాత్రలో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ను సృష్టించుకున్నాడు. ఇక వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం”బుజ్జి ఇలారా”. ఈ సినిమా సైకాలజీ త్రిల్లర్ అనే ఒక కాన్సెప్ట్తో తెరకెక్కించడం జరుగుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఈ రోజున కొద్ది నిమిషాల ముందు టీజర్ విడుదల కాగా వాటి వివరాలను చూద్దాం.

వరంగల్ నగరంలో వరుస కిడ్నాపులు జరగడంతో పోలీసులు హై టెన్షన్ కు గురవుతున్నారు. ఇందులో సిఐగా ధనరాజ్, కేశవ నాయుడు పాత్రలో కనిపించనున్నాడు. ఇక మహమ్మద్ ఖాయమనే పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. ఇక వరంగల్ లోని ప్రజల కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన హంతకులను పట్టుకుని కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు.

ఇక ఈ బాధ్యతలన్నీ ఒక పోలీస్ అధికారి సునీల్ కి చెబుతూ ఉండగా దీని వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని ధనరాజు తెలియజేస్తూ ఉన్నారు. ఇక వారు ఉంటున్నాం నగరంలో క్రైమ్ చేస్తోంది ఎవరు? కిడ్నాప్ వెనక అసలు కారణాలేమిటి అనే విషయంపై తెలియాలంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.

https://youtu.be/j3xDCQ1Ir6U